బాలీవుడ్ లో కొంత కాలంగా చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  ముఖ్యంగా థ్రిల్లర్, హర్రర్, బోల్డ్ కాంటెంట్ ఉన్న సినిమాలు మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి.  ఆ మద్య బాలీవుడ్ లో రిలీజ్ అయిన ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’భారీ హిట్ కాకపోయినా..నిర్మాతలకు నష్టం రాకుండా సక్సెస్ అయ్యింది.  అయితే ఈ సినిమాలో ఎక్కువ బూతు కంటెంట్ ఉంది.  కొన్ని సీన్లు సెన్సార్ వారు తీసివేసినా..అప్పటికే యూట్యూబ్ లో ఆ దృశ్యాలు వచ్చేశాయి. 

ప్రస్తుతం బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం కొనసాగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ సినిమా షూటింగ్ లో నిర్మాత ప్రకాష్ ఝా తనతో తప్పుగా మాట్లాడారని నటి అహనా కుమ్రా ఆరోపణలు చేశారు.  ఈ సినిమాకు అలంకృతా శ్రీవాత్సవ దర్శకత్వ వహించగా ప్రకాష్ ఝా నిర్మించారు. 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో  అహనా కుమ్రా  మాట్లాడుతూ..సినిమాల్లో నటించడానికి వచ్చిన నటీమణుల గురించి చాలా నీచంగా ఆలోచించేవారు సినీ పరిశ్రమలో చాలా మంది ఉన్నారు. 

అసిస్టెంట్ మేనేజర్ నుంచి నిర్మాతల వరకు కొంత మంది వక్రబుద్దుతో చూసేవాళ్లు ఉన్నారని అన్నారు.  2016లో వచ్చిన  ‘లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా’ లో ఓ శృంగార సన్నీవేశం ఉంది..ఆ సమయంలో  ప్రకాష్ ఝా సెట్ కి వచ్చి.. సీన్ అలా చేస్తే బాగుంటుంది..ఇలా చేస్తే బాగుంటుంది..సెక్స్ అప్పీరియన్స్ కావాలి అంటూ రక రకాలుగా ఇబ్బంది పెట్టారని అన్నారు. 

ఆయన మాటలు  వినడానికి చాలా ఇబ్బంది అనిపించిందని, దీంతో వెంటనే దర్శకురాలు దగ్గరకి వెళ్లి విషయం చెప్పానని వివరించింది. దీంతో డైరెక్టర్ ఆయన్ని బయటకి వెళ్లమని పరిస్థితి అర్థం చేసుకొని ఆయ బయటకు వెళ్లిపోయారని అన్నారు.   ఓ వ్యక్తి తనతో తప్పుగా ప్రవర్తించడం సహించలేకపోయాయని.. అలా ఇబ్బంది పెట్టిన వారందరీ నెంబర్లు బ్లాక్ చేసినట్లు తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: