సంచ‌ల‌నం సృష్టించిన టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ ఎపిసోడ్ మ‌రో మ‌లుపు తిరిగింది. తెలుగు రాష్ట్రాలు, సిసిమా పరిశ్రమలో సంచలనం రేపిన మాదక ద్రవ్యాల కేసుపై సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలను ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెస్ వ్యవస్థాపకుడు పద్మనాభరెడ్డి మంగళవారం మీడియాకు వివరించారు. ఈ కేసును ఎక్సైజుశాఖ నీరు గార్చినట్టు తేలిపోవడంతో అవినీతి నిరోధకశాఖ లేక విజిలెన్స్ కమిషన్ ద్వారా దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పించినట్టు ఆయన తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు అధికారుల లొసుగులను చూస్తే రాష్ట్రంలో పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయమన్నట్టుగా ఉందని పద్మనాభరెడ్డి దుయ్యబట్టారు. 


అయితే, సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్ చీట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల కేసులో ఇప్పటివరకు ఏడు ఛార్జిషీట్లు దాఖలు చేశామని, ఇంకా ఐదు ఛార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉందన్నారు. సినీ ప్రముఖుల వ్యవహారంలో ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చాయని వివరించారు. త్వరలో మిగతా ఛార్జిషీట్లు దాఖలు చేస్తామని వెల్లడించారు. మాదక ద్రవ్యాల కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టబోమని అధికారులు హెచ్చరించారు. ఈ కేసులో 62 మందిని విచారించామని, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. ఇంకా పలు ఆధారాలు రావల్సి ఉందని  వచ్చిన తరువాత సరైన చర్యలు తీసుకుంటామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: