డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం హిట్ కోసం తెగ తాపత్రయపడుతున్నారు. గతంలో రోజులలో సినిమాలు తీసేసి ఇండస్ట్రీ హిట్లు రికార్డుల పగలగొట్టిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం టైమ్ తీసుకుని సినిమాలు చేస్తున్నా కాని బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటం అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గత కొంత కాలం నుండి సినిమా హిట్ కోసం అన్ని విధాలా కృషి చేసిన పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరి ని హీరోగా పెట్టి తాను నిర్మాతగా వ్యవహరించి 'మెహబూబా' అనే సినిమాని డైరెక్ట్ చేసిన హిట్ పడలేదు.

Image result for IsmartShankar

ఇటువంటి క్రమంలో తనకు మాదిరే హిట్ కోసం వెయిట్ చేస్తున్నా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో కలిసి ఔట్ అవుట్ అండ్ మాస్ ఎంటర్టైనర్ ఇస్మార్ర్ట్ శంకర్ అనే సినిమా తెరకెక్కించడం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల రాం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల చేశారు సినిమా నిర్మాతలు. అయితే తాజాగా విడుదలైన ఇస్మార్ర్ట్ శంకర్ టీజర్ లో కొత్తదనం లేకపోవడం మరి హీరో రామ్ బాడీ లాంగ్వేజ్, లుక్ చాలా ఎఫెక్టివ్ గా ఉండకపోవటం తో సినిమాపై అప్పుడే సోషల్ మీడియాలో నెగటివ్ ఫీలింగ్ కలిగేటట్లు ఉంది అని కామెంట్ చేస్తున్నారు.

Related image

సినిమా టీజర్ నీ చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా ఇది పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన సినిమా ఏనా..? అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న పూరి జగన్నాథ్ అభిమానులు ఈ సినిమా టీజర్ చూడటంతో ఓపెనింగ్స్ రావడం కష్టమే అని...అసలే డౌన్ ఫాల్ లో ఉన్న పూరి ఇటువంటి టీజర్ ఇవ్వటం ఏమిటని ...అసలు టీజర్లో కొత్తదనం లేదని కామెంట్ చేస్తున్నారు .



మరింత సమాచారం తెలుసుకోండి: