ఫిలిం ఇండస్ట్రీలో మహేష్ మనస్థత్వాన్ని ఇప్పటి వరకు పరిశీలించినవారు అతడిని దర్శకుల పక్షపాతి అని అంటారు. నిర్మాతల కంటే దర్శకులకే విలువ ఎక్కువ ఇవ్వడం వారి మాటే నెగ్గేలా చేయడం మహేష్‌కి ఉన్న అలవాటు. కానీ మహర్షి విషయంలో దర్శకుడు వంశీ పైడిపల్లి కంటే దిల్‌ రాజు ఎక్కువగా మహేష్‌ ని ఎక్కువగా మెప్పించాడు అని వార్తలు వస్తున్నాయి. 

ఈసినిమా విడుదల విషయంలో ప్లానింగ్‌ దగ్గర్నుంచి బిజినెస్‌ వరకు అన్నిట్లోను దిల్‌ రాజు వ్యవహరించిన తీరు మహేష్ కు ఎంతో నచ్చిందని పార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాను సోలోగా దిల్ రాజ్ చేయవలసి ఉన్నా మహేష్ కు ఉన్న కమిట్ మెంట్స్ రీత్యా మరో ఇద్దరు నిర్మాతలను కలుపుకుని వారి నుంచి ఎదురైన సమస్యల విషయంలో దిల్ రాజ్ చాల చక్కగా వ్యవహరించడం మహేష్ కు ఎంతో నచ్చింది అన్న ప్రచారం జరుగుతోంది.

దీనితో మహేష్‌ కు దిల్ రాజ్ పట్ల మరింత గౌరవం ఇష్టం పెరిగిపోయి మరో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ‘మహర్షి’ మూవీ రిలీజ్ ప్లానింగ్ తో పాటు మల్టీప్లెక్స్‌లలో టికెట్‌ రేట్లు పెంచుకునే విషయంలో ఈ చిత్రానికి సంబంధించిన కలక్షన్స్ విషయంలో తాము చెపుతున్న ఫిగర్స్ తప్ప మరొక ఫిగర్ ప్రచారంలోకి రాకుండా ఎక్కడా కలక్షన్స్ ఫిగర్స్ విషయంలో నెగిటివ్ వార్తలు రాకుండా దిల్ రాజ్ అనుసరించిన వ్యూహం ‘మహర్షి’ సక్సస్ కు కీలకంగా మారింది అన్న అభిప్రాయంలో మహేష్ ఉన్నట్లు టాక్. 

దీనితో మహేష్ తన అభిప్రాయం మార్చుకుని అనీల్ రావిపూడి దర్శకుడుగా తాను నటిస్తున్న సినిమాకు కూడ దిల్ రాజ్ ను సహనిర్మాతగా ఉండమని ఒత్తిడి పెంచుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజ్ తప్పుకున్నాడు. అయితే ఇప్పుడు మహేష్ ఒత్తిడి పెరిగిపోవడంతో దిల్ రాజ్ ఈసినిమాకు కూడ సహనిర్మాతగా వ్యవహరిస్తే దిల్ రాజ్ మాటల గారడిలో మహేష్ పడిపోయాడు అన్న మాటలకు ఉదాహరణ అంటూ టాప్ హీరోలను ఆకర్షించే విషయంలో దిల్ రాజ్ కుఎదురులేదు అన్న ప్రచారం జరుగుతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: