మహేష్ బాబు మహర్షి సినిమా సూపర్ సక్సెస్ సాధించింది.  రైతుల సమస్యలకు సంబంధించిన కంటెంట్ ఉండటంతో సినిమాకు ప్లస్ అయింది.  రైతుల సమస్యలను గురించి చర్చించి వదిలేస్తే సరిపోదు దానికి సొల్యూషన్ కూడా చెప్పాలని ... వీకెండ్ ఫార్మింగ్ ప్లాన్ చెప్తాడు.  చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు... వీకెండ్ రోజున పొలాల్లోకి దిగి రైతుగా మారిపోయిన సంగతి తెలిసిందే.  ప్రతి ఒక్కరు రైతుకోసం ఆలోచిస్తే.. రైతు చల్లగా ఉంటాడు.  రైతు చల్లగా ఉంటె దేశం పచ్చగా ఉంటుంది. 


సినిమాను చూసి ఎంజాయ్ చేసి వదియలెయ్యకుండా... వీకెండ్ ఫార్మింగ్ పేరుతో సోషల్ మీడియాలోయాష్ ట్యాగ్ క్రియేట్ అయింది.  పిల్లలు పెద్దలు అందరు వ్యవసాయం చేస్తూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో  పోస్ట్ చేశారు.  రైతుల కోసం మరో హీరో మరోసారి మంచి మనసును చాటుకున్నాడు.  ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో విశాల్.  


టాలీవుడ్ సినిమా టెంపర్ ను తమిళంలో అయోగ్య పేరుతో విశాల్ హీరోగా తెరకెక్కింది.  రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.  సెంటిమెంట్, ఆటిట్యూడ్ తో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతున్నది.  ఈ సందర్భంగా విశాల్ ప్రేక్షకులకు ఓ విన్నపం చేశారు.  టిక్కెట్ కొనే ప్రతి ఒక్కరు ఒక రూపాయి డొనేట్ చేయాలని, ఆ డబ్బులను రైతుల కోసం వినియోగించాలని కోరారు.  అభిమన్యుడు సినిమా సమయంలోను విశాల్ ఇలాగే అలోచించి మంచి పని చేశారు.  అటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: