సినీ ఇండ‌స్ర్టీలో ఎవ‌రి అదృష్టం ఎలా ఉంటుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. కొంద‌రు కొన్ని సినిమాలు హిట్లు కొన్ని ఫ్లాపులు ఉంటాయి. మ‌రికొంత‌మంది ఎంత క‌ష్ట‌ప‌డ్డా హిట్ట‌నేదే వారి కెరీర్‌లో ఉండ‌దు. అయినా పాపం వాళ్లు అలా హిట్ కోసం ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు అదే వేరే విష‌యం. ఇక ప్ర‌స్తుతం ఉన్న టాప్ డైరెక్ట‌ర్ల‌లో అనిల్ రావిపుడి ఒక‌రు. తీసింది నాలుగు సినిమాలే అయినా ఫ్లాప్ అనేదే లేదు. వ‌రుస హిట్ల‌తో విజ‌యాన్ని త‌న‌వెంటే పెట్టుకుని తిరుగుతున్నారు.


‘సుప్రీమ్’, ‘రాజా ది గ్రేట్’తోనూ విజయాలు అందుకున్నాడు. సంక్రాంతి సీజన్‌లో కథానాయకుడు, వినయ విధేయ రామ వంటి భారీ చిత్రాలతో పోటీపడి విడుదలైన ‘ఎఫ్2’ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. విక్టరీ వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్‌ను ఫుల్‌గా వాడుకున్న అనిల్ ‘ఎఫ్‌2’ను ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. దీంతో అచ్చమైన సంక్రాంతి సినిమా ఇదేనంటూ ఫ్యామిలీ ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో సెకండ్ వీకెండ్‌లోనూ స్టడీగా కలెక్షన్లు రాబడుతోంది ఈ సినిమా. 


త‌నుతీసుకున్న ఎటువంటి క‌థ‌నైనా కాస్త వినోద‌భ‌రితంగా మార్చి చూపించ‌డ‌మే ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. రాజా ది గ్రేట్‌లో హీరో రవితేజ అంధుడైనప్పటికీ ఆ పాత్రతోనూ నవ్వులు పూయించాడు. కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా తీయగల ఆయన.. వీవీ వినాయక్, శ్రీను వైట్లను గుర్తుచేస్తున్నారు. అయితే ఒకే మూసలో కాకుండా సినిమా సినిమాకు వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చూసుకుంటున్నారు. అనుకున్న బడ్జెట్‌లోనే సినిమాలు తీస్తుండటం, వరుస విజయాలతో అనిల్‌కు ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది.


ఇక మ‌న‌సినీ ఇండ‌స్ర్టీ గురించి తెలిసిందే క‌దా ఎవ‌రైనా ఒక‌రు హిట్ ఇస్తే చాలు నిర్మాత‌లంద‌రూ వారి వెంటే ఉంటారు.  దీంతో ఈ యంగ్ డైరెక్టర్ రెమ్యునరేషన్ ఒక్కసారిగా పెంచేశాడట. ‘ఎఫ్2’కి రూ.ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న అనిల్.. తర్వాత సినిమాకు రూ.9కోట్లు డిమాండ్ చేస్తున్నార‌ట. అయితే అతడికి ఉన్న డిమాండ్, విజయాలను చూస్తున్న నిర్మాతలు అడిగినంతా ఇచ్చి సినిమాలు తీసేందుకు పోటీ పడుతున్నారట. అయినా సినీ ఇండస్ట్రీలో హిట్లు వస్తే రేటు పెంచడం, ప్లాపులు వస్తే అవకాశాల కోసం ఎదురు చూడటం మామూలే కదా. ప్ర‌స్తుతం చేయ‌బోయే మ‌హేశ్‌బాబు చిత్రానికి 15కోట్లు డిమాండ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: