ఇప్పటికే తన 25వ సినిమా మహర్షి తో కెరీర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రేక్షకులు మరియు అభిమానులు ఇచ్చిన ఈ అనూహ్య విజయంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో కలెక్షన్లు కాస్త మందగించడంతో, వాటిని మరింత పెంచేందుకు మహర్షి టీమ్ రకరకాలుగా ప్రేక్షకులకు పబ్లిసిటీ రూపంలో దగ్గరవుతోంది. ఇక మహేష్ బాబు అయితే, ఎప్పటికపుడు ఇంటర్వూస్ ఇస్తూ ప్రేక్షకులు మరియు తన అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇప్పటికి మహర్షి విడుదలై తొమ్మిది రోజులు దాటినప్పటికీ కూడా ఈ సినిమా కలెక్షన్ల హవా పెద్దగా తగ్గలేదు. 
 
ఇక తమకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహర్షి యూనిట్ రేపు అనగా 18వ తేదీ సాయంత్రం విజయవాడ వేదికగా విజయోత్సవ వేడుక ఎంతో వైభవంగా నిర్వహించనుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మహర్షి యూనిట్ అధికారిక ప్రకటన కూడా వెలువరించింది. ఇకపోతే మరోవైపు మహేష్ నటించే 26వ సినిమాకు సంబంధించి ప్రీ పొడక్షన్ వర్క్ కూడా ఫుల్ స్వింగ్ లో వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఉంటూనే మరోవైపు సూపర్ స్టార్ మహేష్ స్టార్డం ని ఏమాత్రం తగ్గించకుండా ఎంతో జాగ్రత్తగా పక్కా మాస్ స్క్రిప్ట్ సిద్ధం చేసాడట. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నటీనటులు మరియు సాంకేతికనిపుణులు ఎంపిక కూడా చాలావరకు పూర్తి అయిందని, అలానే సినిమా లొకేషన్లు కూడా ఫైనలైజ్ చేసారని సమాచారం. ఇకపోతే నిన్నటి నుండి ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. 
 
అది ఏంటంటే, మహేష్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమా పేరు 'రెడ్డిగారి అబ్బాయి' అని నిర్ణయించడం జరిగిందని, కథ రీత్యా ఈ టైటిల్ అయితే బాగుంటుందని దర్శకుడు అనిల్ ఈ టైటిల్ కి వోటేసినట్లు కొన్ని టాలీవుడ్ వర్గాలు గుసగుస లాడుతున్నాయి. అయితే ఈ వార్త నిజమా కాదా అనే విషయం అటుంచితే, ఈ టైటిల్ సూపర్బ్ గా ఉందని, ఈ సినిమాతో చాలా ఏళ్ల తరువాత పక్కా మహేష్ బాబు ను చూడడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికల్లో ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు ఈ టైటిల్ మహేష్ 26 కు నిర్ణయించిందేనా లేక ఇది ఒట్టి పుకారు అనేది తెలియాలంటే మాత్రం ఆ చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడవలసిందే.....!!!!

మరింత సమాచారం తెలుసుకోండి: