మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మాతగా అత్యంత భారీ ఖర్చు మరియు సాంకేతిక విలువలతో రూపొందుతున్న చిత్రం సైరా. ఇటీవల మెగాస్టార్ చిరు పుట్టినరోజు కానుకగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కు ఫ్యాన్స్ నుండి విపరీతమైన స్పందన వచ్చింది. ఇక ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే కొద్దిరోజులుగా ఈ సినిమాకు ఏవేవో చిన్నపాటి అడ్డంకులు వస్తూనే వున్నాయి. మొదట్లో సినిమాలో మెగాస్టార్ మరియు అమితాబ్ బచ్చన్ ల లుక్ బయటకు లీక్ కావడం, అలానే మరికొందరు బ్రిటిష్ పాత్రధారుల ఫొటోస్ లీక్ కావడం, ఇకపోతే ఒక వారం క్రితం ఈ సినిమా షూటింగ్ సమయంలో రూ.2 కోట్లు విలువ చేసే సెట్ ఒకటి అగ్నికి ఆహుతి అవడం వంటివి సినిమాకు కొద్దిపాటి అవరోధాలుగా మారాయి. 

అయితే ఇప్పటివరకు వీటివల్ల షూటింగ్ కు పెద్ద అడ్డంకి అయితే ఏమి కలుగలేదని అంటోంది చిత్ర యూనిట్. ఇకపోతే నిన్న ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న అలెగ్జాన్డర్ అనే విదేశీయుడు, షూటింగ్ తరువాత అనారోగ్య కారణంగా మృతి చెందినట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే నిజానికి అలెగ్జాన్డర్ అనే ఈ వ్యక్తి కొన్ని నెలల క్రితం విదేశాల నుండి ఇక్కడికి పని కోసం రావడం జరిగిందని, ఆ క్రమంలో సైరా షూటింగ్ కోసం కొందరు విదేశీయుల పాత్రల ఎంపిక సమయంలో అలెగ్జాన్డర్ ని కూడా చిత్ర యూనిట్ సెలెక్ట్ చేయడం జరిగిందట. అయితే అతని షూటింగ్ పార్ట్ మాత్రం పూర్తి అయిందని, ఇక నిన్న సాయంత్రం అతడు తన రూమ్ వద్ద అపస్మారక స్థితిలో పడి ఉండగా చిత్ర యూనిట్ లోని సిబ్బంది గ్రహించి వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారని, అయితే అప్పటికే అతడు మరణించాడని అంటున్నారు. 


ఇక అతడివద్ద ఉన్న కెమెరాలో సైరా షూటింగ్ లో పాల్గొన్న సమయంలో తీసిన కొన్ని ఫోటోల ఆధారంగా అతడు ఆ సినిమాలో పనిచేసి ఉంటాడని పోలీసులు భవిస్తున్నారట. అయితే ఈ విషయమై ఇప్పటివరకు సైరా చిత్ర బృందం నుండి ఎటువంటి అధికారిక సమాచారం మాత్రం వెలువడలేదని తెలుస్తోంది. మరి ఆ చనిపోయిన వ్యక్తి అసలు సైరా షూటింగ్ లో పాల్గొన్న వ్యక్తా? కాదా? అనేది మాత్రం వారినుండి ఆదరికారిక ప్రకటన వచ్చే వరకు చెప్పలేమని అర్ధమవుతోంది. కాగా ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!!




మరింత సమాచారం తెలుసుకోండి: