సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 25వ సినిమా మహర్షి సినిమా సక్సెస్ ని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనే చెప్పాలి. కెరీర్ లో ఆ మధ్య కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్న సూపర్ స్టార్, ఆపై చాలా రోజులకు హిట్ వెంట హిట్ కొట్టడంతో అయన ఫ్యాన్స్ కూడా మంచి జోష్ మీదున్నారు. ఇక మహేష్ బాబు కూడా అదే జోష్ తో వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే వరుసగా మెసేజి ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తున్న మహేష్ బాబు, ఇకపై చేయబోయే సినిమాలు పూర్తి స్థాయి వినోదం మరియు కమర్షియల్ హంగులతో కూడినవి అయితేనే సెలక్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇటీవల తన ఇంటర్వ్యూ లో ఇదే విషయాన్ని మహేష్ స్వయంగా చెప్పారు కూడా. నిజానికి తాను సుకుమార్ తో చేయబోయే సినిమా కథ బాగున్నప్పటికీ కూడా ఇకపై కొన్నాళ్ళు తాను మంచి ఎంటర్టైన్మెంట్ కథలు చేయాలని నిర్ణయించడంతోనే అది వద్దనుకుని, అనిల్ రావిపూడి చెప్పిన కమర్షియల్ ఎంటర్టైనర్ కి పచ్చజండా ఊపినట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే తదుపరి కూడా ఆయన అటువంటి కథలనే చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

ఇక రెండురోజుల క్రితం ఇటీవల విజయ్ దేవరకొండ తో గీత గోవిందం వంటి సక్సెస్ ఫుల్ సినిమాని  తీసిన పరశురామ్, మహేష్ బాబు ను కలవడం జరిగిందట. నిజానికి చాలా రోజుల నుండి పరశురామ్, మహేష్ ను కలవాలని భావించినప్పటికీ మహేష్ కొంత బిజీగా ఉండడం వలన అది కుదరలేదట. ఇక మొన్న దర్శకుడు కొరటాల శివ సహాయంతో పరశురామ్ మహేష్ ని కలవడం జరిగిందని, అంతేకాక ఆ సయమంలో తన వద్ద ఉన్న ఒక కథను మహేష్ కు వినిపించడం జరిగిందని అంటున్నారు. అయితే అయన చెప్పిన స్టోరీ మహేష్ కు చాలా బాగా నచ్చిందని, అయితే దానిని పూర్తి స్క్రిప్ట్ రూపొందించుకుని తన వద్దకు వస్తే తప్పకుండ చేద్దాం అని మహేష్ కూడా చెప్పారట. దానితో ఒక్కసారిగా ఎగిరి గంతేసిన పరశురాం, ప్రస్తుతం ఆ పనిలో పూర్తిగా నిమగ్నమయ్యారట. 


ఇక అన్ని అనుకున్నట్లు జరిగి ఒకవేళ పరశురాంతో మహేష్ సినిమా చేయాలని నిర్ణయిస్తే, ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తారని కూడా సమాచారం. ఇక అనిల్ రావిపూడి సినిమా పట్టాలెక్కిన తరువాత మహేష్ కు పరశురామ్ పూర్తి స్థాయి కథను వినిపించి ఒప్పిస్తే మాత్రం, ఈ కాంబినేషన్ తప్పకుండా సెట్ అవుతుందని అంటున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మహేష్ ఫ్యాన్స్ కు అయన నుండి హిట్ రూపంలో మరొక గిఫ్ట్ లభించినట్లేగా మరి.. అయితే ఈ విషయమై ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏది రానప్పటికీ, ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ మరియు మీడియా వర్గాల్లో వైరల్ గా మారింది....!!! 




మరింత సమాచారం తెలుసుకోండి: