సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు మ‌హ‌ర్షి సినిమా గ‌త గురువారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మిక్స్‌డ్ టాక్‌తో కూడా వ‌సూళ్ల ప‌రంగా దూసుకుపోతోంది. కేవ‌లం నాలుగు రోజుల‌కే రూ.100 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా రూ.65 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక తొలి వారం ముగిసేస‌రికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.58 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమా ఒక్క నైజాంలోనే ఏకంగా రూ. 21 కోట్ల షేర్ రాబ‌ట్టింది. నైజాంలో మ‌హేష్ గ‌త సినిమాల రికార్డుల‌ను కూడా మ‌హ‌ర్షి దాటేసింది.

ఇక అన్ని ఏరియాల్లోనూ బ్రేక ఈవెన్ దాటేసి లాభాల భాట ప‌ట్టేసిన మ‌హ‌ర్షి కొన్ని చోట్ల మాత్రం నిరాశ‌జ‌న‌క క‌లెక్ష‌న్స్ రాబ‌డుతోంది. ముఖ్యంగా రెండు చోట్ల ఈ సినిమాకు భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు. మ‌హ‌ర్షి కోస్తాతో పాటు పొరుగు రాష్ట్రాలు అయిన త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌లోనూ దూసుకుపోతోంది. అయితే ఇందుకు భిన్నంగా సీడెడ్ ఏరియాలోనూ.. ఓవర్సీస్ లోనూ మహర్షి భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. సీడెడ్ ఎలాగూ మ‌హేష్‌కు పెద్ద‌గా ప‌ట్టు ఉండ‌దు. మ‌హేష్ కంచుకోట అయిన ఓవ‌ర్సీస్లోనూ ప‌రిస్థితి అనుకూలంగా లేక‌పోవ‌డం విచిత్ర‌మే.

సీడెడ్ విషయమే తీసుకుంటే.. బ్రేక్ ఈవెన్ మార్క్ చేరడానికి రూ. 12 కోట్ల షేర్ వసూలు చేయాలి. ఇక్కడ మొదటి వారంలో రూ. 6.86 కోట్ల షేర్ మాత్రమే వ‌చ్చింది. రెండో వారంలో ఈ స్పీడ్ కొన‌సాగే ప‌రిస్థితి లేదు. వీకెండ్ మిన‌హా మిగిలిన రోజుల్లో సీడెడ్‌లో అద‌న‌పు థియేట‌ర్లు ఖాళీగా ఉండ‌డంతో షేర్ హ‌రించుకుపోయింది. ఇక్క‌డ లాంగ్ ర‌న్లో మ‌హా అయితే రూ.8 కోట్లు మాత్ర‌మే అంటున్నారు.

ఇక ఓవ‌ర్సీస్లో బ్రేక్ ఈవెన్‌కు రూ.13 కోట్లు షేర్ రావాలి. అంటే 3.5 మిలియ‌న్ డాల‌ర్లు. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ కేవ‌లం 1.6 మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే వ‌చ్చాయి. అక్క‌డ లాంగ్ ర‌న్‌లో  2.5 మిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే కొల్ల‌గొడుతుందంటున్నారు. ఈ లెక్క‌న చూస్తే సీడెడ్‌, ఓవ‌ర్సీస్‌లో మాత్రం మ‌హ‌ర్షికి లాస్ త‌ప్పేలా లేదు. ఇంత హిట్ సినిమాకు అక్క‌డ న‌ష్టాలు రావ‌డం అవ‌మానం లాంటిదే.



మరింత సమాచారం తెలుసుకోండి: