‘జెర్సీ’ విజయంతో మరింత వేగం పెంచిన నాని ఈ సంవత్సరం తన వైపు నుండి రాబోతున్న తన మరో సినిమా ‘గ్యాంగ్ లీడర్’ కు లైన్ క్లియర్ చేసాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీ షూటింగ్ ఇప్పటికే సగం పైగా పూర్తి కావడంతో ఈమూవీ షూటింగ్ ను మరింత వేగంగా పూర్తి చేసి ఆగష్టు 30న విడుదల చేసే విధంగా ఏకంగా నాలుగు నెలలు ముందు తన మూవీ రిలీజ్ డేట్ ను బ్లాక్ చేసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ప్రతి సంవత్సరం తన వైపు నుండి రెండు సినిమాలు రిలీజ్ ఉండే విధంగా నాని పక్కా యాక్షన్ ప్లాన్ లో ముందుకు వెళుతున్నాడు. ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ పూర్తి అయిన వెంటనే నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నటించబోయే ‘వి’ షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నాడు. 

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించబోయే సినిమాకు మెగా యంగ్ హీరోలు కూడా సాహసం చేయలేని ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్ పెట్టడం ఒక సంచలనం అయితే ఇప్పుడు ఆ మూవీని ప్రభాస్ ‘సాహో’ విడుదలైన కేవలం రెండు వారాల గ్యాప్ తో తన ‘గ్యాంగ్ లీడర్’ ను రేసులోకి దింపడంతో ఇప్పటికే ఆ డేట్ పై కన్నేసిన నాగార్జున ‘మన్మధుడు 2’ పరిస్థితి ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 

గతంలో ఇలాగే నాని తన ‘ఎమ్.సి.ఏ’ మూవీని అఖిల్ ‘హలో’ మూవీతో పోటీగా విడుదల చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు నాని ఇలా ప్రభాస్ ‘సాహో’ మ్యానియాను లెక్క చేయకుండా రెండు వారాల గ్యాప్ తో తన ‘గ్యాంగ్ లీడర్’ ను దింపుతున్న నేపధ్యంలో నాని ప్రస్తుతం టాప్ హీరోల సినిమాలను కూడా లెక్క చేయడం లేదు అన్న కామెంట్స్ వచ్చేలా పరిస్థితులు ఏర్పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: