ప్రతి సంవత్సరం టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక డిజైరబుల్ మెన్ లిస్టును ప్రకటిస్తూ ఉంటుంది. ఈ లిస్టులో ప్రతిసారి ఎంత గొప్ప ఫిలిం సెలెబ్రెటీ అయినప్పటికీ వారివారి స్థానాలలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈసారి టైమ్స్ పత్రిక ఎప్పటిలాగే 50 డిజైరబుల్ మెన్స్ లిస్టును ప్రకటిస్తూ మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 

టైమ్స్ ‘మోస్ట్ ఫరెవర్ డిజైరబుల్ క్లబ్’ పేరిట క్రియేట్ చేయబడిన ఈ సెలెబ్రెటీ క్లబ్ లో దక్షిణ భారత సినిమా రంగం నుండి ఒక్క మహేష్ బాబుకు మాత్రమే స్థానం లభించడం అత్యంత ఆశ్చర్యకర న్యూస్ గా మారింది. దక్షిణాది సినిమా రంగానికి సంబంధించి ఎందరో సెలెబ్రెటీలు ఉన్నా వారెవ్వరికీ లేని గుర్తింపు గౌరవం మహేష్ కు టైమ్స్ పత్రిక కల్పించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

ఈ మోస్ట్ ఫరెవర్ డిజైరబుల్ క్లబ్ లో సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ అక్షయ కుమార్ ల సరసన మహేష్ ఈ శాశ్విత డిజైరబుల్ క్లబ్ లో స్థానం సంపాదించుకున్నాడు. వీరితో పాటు ఇండియాలో వివిధ రంగాలలో రాణిస్తున్న అనేకమంది ప్రముఖులు కూడ ఈ డిజైరబుల్ లిస్టులో ఉండటం సంచలనంగా మారింది.

ఇది ఇలా ఉండగా ‘మహర్షి’ మూవీ గత సోమవారం నుండి నిన్నటి గురువారం వరకు ప్రపంచ వ్యాప్తంగా 48 కోట్ల గ్రాస్ ను రాబట్టడంతో ఈమూవీ విడుదలై 8 రోజులు పూర్తి అయిన నేపధ్యంలో ఈమూవీకి 150.45  కోట్లు గ్రాస్ కలక్షన్స్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈరోజు విడుదలైన అల్లు శిరీష్ ‘ఎబిసిడి’ కి మొదటిరోజు మొదటి షో నుండి నఎవరేజ్ టాక్ రావడంతో ఈ వీకెండ్ లో కూడ ‘మహర్షి’ కలక్షన్స్ హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తూ ఇప్పటికే  127.20 కోట్ల గ్రాస్ రాబట్టిన ‘ఎఫ్ 2’ రికార్డులను బ్రేక్ చేసినా ‘భరత్ అనే నేను’ మూవీ రికార్డులను బ్రేక్ చేసే విషయంలో వెనకపడి పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకున్నా బ్లాక్ బస్టర్ హిట్ విషయంలో ప్రస్తుతానికి వెనకపడి ఉంది..  



మరింత సమాచారం తెలుసుకోండి: