సినీ పరిశ్రమలో ఎన్న ప్రయోగాత్మక పాత్రల్లో నటించి అందరి మెప్పు పొందారు విశ్వనటులు కమల్ హాసన్.  ఆయన వేసిన పాత్రలు చేసిన ప్రయోగాలు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదంటే అతిశయోక్తి లేదు.  నటుడిగా, క్లాసికల్ డ్యాన్సర్, దర్శకులు, నిర్మాతగా అన్ని రకాల పాత్రలు పోషించిన ఆయన ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా అవతారమెత్తారు.  కమల్ హాసన్ ఆదివారం తమిళనాడులోని అరవకురిచ్చిలో ఎన్నికల ప్రచారం చేస్తూ.. "నాథూరాం గాడ్సే స్వతంత్ర భారత దేశంలో తొలి తీవ్రవాది, ఆయన హిందూ" అన్నారు.


కమల్ హాసన్ తమిళంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.  దాంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాల దుమారం రేపాయి. కొన్ని హిందూ సంఘాలు కమల్ హాసన్ పై చర్యలు తీసుకోవాలని..హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన వ్యాఖ్యానించారని ఆరోపణలు చేశారు.  తాజాగా జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరామ్‌ గాడ్సేను స్వతంత్ర భారతదేశంలో తొలి తీవ్రవాదిగా పేర్కొంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీ నటుడు, మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్‌ హాసన్‌ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చాడు.  


గాడ్సేపై తాను చేసిన వ్యాఖ్యలు వివాదం కాలేదని, హిందూ సంఘాలే వాటిని వివాదంగా మార్చాయని అన్నారు. పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయం తనకు లేదని, తనని అరెస్ట్‌ చేస్తే పరిస్థితులు ఉద్రిక్తంగా ఉంటాయని, అరెస్ట్‌ చేయకపోవడం వారికే మంచిదన్నారు. రాజకీయాల్లో నాణ్యత తగ్గిపోతుందన్నారు. అన్ని మతాల్లోనూ ఉగ్రవాదులు, అతివాదులూ ఉన్నారని చరిత్ర చెబుతుందని ఆయన తెలిపారు.   అరెస్టు విషయంలో తాను హెచ్చరించడం లేదు.. సలహా మాత్రమే ఇస్తున్నానని కమల్‌ హాసన్‌ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: