మరో ఐదు రోజులలో ఎన్నికల ఫలితాలు రాబోతు ఉండటంతో కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు అన్న విషయమై అందరిలోనూ ఆత్రుత పెరిగి పోతోంది. ఈ విషయాల మధ్య పవన్ ‘జనసేన’ కు రాబోతున్న సీట్ల గురించి అతడికి పడ్డ ఓట్ల శాతం గురించి విపరీతమైన చర్చలు చాల లోతుగా రాజకీయ వర్గాలలో జరుగుతున్నాయి.

ఇలాంటి పరిస్థుతులలో కమెడియన్ ధన్ రాజ్ ఇచ్చిన రాజకీయ తుఫాన్ హెచ్చరికలు పవన్ అభిమానులలో హాట్ టాపిక్ గా మారింది. ‘బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. 23న తుఫానుగా మారి, శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమగోదావరి మీదుగా కుప్పంలో తీరం దాటనుంది. గంటకు 120-145 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. ఆ గాల్లో ఎవడైనా ఎగిరిపోతే మాకు ఏ సంబంధం లేదు. ప్రమాద హెచ్చరిక ముందుగానే జారీ చేశాం. తుఫానుకి "జనసేన శతఘ్ని" అని నామకరణం చేశారు’ అంటూ ధన్‌ రాజ్ ఫేస్‌బుక్‌ లో పోస్ట్ పెట్టాడు. 

ఇప్పుడు ఈ పోస్ట్ పవన్ అభిమానులను విపరీతంగా ఆకర్షించింది. అంతేకాదు ధన్ రాజ్ అంచనాల ప్రకారం జనసేన సునామి రాబోతోందా అంటూ ఏకంగా పవన్ అభిమానులు కూడ నమ్మలేని ఆశ్చర్యంలో ఉన్నట్లు టాక్. వాస్తవానికి పవన్ ‘జనసేన’ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలలో బాగా ఉన్నది అన్న విషయం వాస్తవమే అయినా ఈ రేంజ్ లో సునామీ వస్తుందా అంటూ ఏకంగా పవన్ వీరాభిమానులు కూడ తమ ఆశ్చర్యాన్ని తెలియచేస్తున్నట్లు టాక్. 

అయితే ధన్ రాజ్ పోస్ట్ పై విపరీతమైన సెటైర్లు పడటంతో కొన్ని గంటల తరువాత దన్ రాజ్ ఆ పోస్ట్ ను తన ఫేస్ బుక్ నుండి డిలీట్ చేయడం మరింత ఆశ్చర్యంగా మారింది. దీనితో దన్ రాజ్ ఇది అంతా పవన్ ను పొగడడానికి చేసాడా లేదంటే అతడు కూడ మరొక ఉద్దేశ్యంతో ఇలాంటి కామెంట్ చేసాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: