ఇప్పటి కొత్త తరానికి షకీలా అంటే ఎవరో పెద్దగా తెలియదుగాని, 90 దశకంలోని వాళ్లకు షకీలా అంటే బాగా తెలుసు.  ఆమె సినిమా చేస్తోంది అంటే పెద్ద స్టార్స్ సినిమా హాల్స్ ఖాళీగా దర్శనం ఇచ్చేవి.  మలయాళంలో శృంగార తారగా పేరు తెచ్చుకుంది.  సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చిన్న చిన్న పాత్రలను చేసిన షకీలా ఆ తరువాత పెద్దల సినిమాల్లో అవకాశం వచ్చింది.  వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో ఆమెపై చాలామంది కసిగట్టి షకీలా కెరీర్ను దెబ్బతీయాలని చూశారు.  ఇది బహిరంగ రహస్యమే.  అప్పట్లో మీడియాలో దీని గురించి అనేక కథనాలు కూడా వచ్చాయి.  


గత కొంతకాలంగా షకీలా సినిమాలకు దూరంగా ఉంటోంది.  ఆమె జీవిత చరిత్ర ఆధారంగా షకీలా బయోపిక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే.  బాలీవుడ్ నటి రిచా చద్దా టైటిల్ పాత్రలో నటిస్తోంది.  హిందీతో పాటు దక్షణాది భాషల్లోను ఈ సినిమాను డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.  ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న షకీలా ఈ సినిమా ద్వారా ఓ పెద్ద బాంబు పేల్చబోతున్నది.  సినిమా రంగంలో ఉన్న సమయంలో ఎవరెవరు తనని అణగదొక్కాలని చూశారు.  ఎందుకు అలా చేశారు.  వారి పేర్లు ఏంటి అనే విషయాలను ఈ సినిమా ద్వారా చూపించబోతున్నట్టు తెలుస్తోంది.  


షకీలా సినిమాలంటే భయపడిన చాలామంది పెద్దమనుషులు ఇప్పుడు షకీలా బయోపిక్ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.  ఇందులో ఆయా వ్యక్తుల పేర్లను బహిరంగంగా చూపిస్తారా లేదంటే పాత్రలను పేర్లను మార్చి ప్రేక్షకులకు అర్ధమయ్యేలా చెప్తారా అన్నది తెలియాలి.  షకీలా బయోపిక్ కోసం ఇప్పుడు అందరు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.  బయోపిక్ రిలీజ్ అయ్యి హిట్ కొడితే... షకీలా మరలా వార్తల్లోకి వస్తుంది.  సినిమాల్లో అవకాశాలు వస్తాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: