సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అంటే బాక్సాఫీస్ హంగామా వేరేలా ఉంటుంది. మహేష్ సినిమా టాక్ ఎలా ఉన్న రిలీజైన మొదటి రెండు రోజులు బాక్సాఫీస్ షేక్ అవుతుంది. అదే సినిమా అంచనాలకు తగినట్టుగా ఉంటే ఇక ఆ రచ్చ మాములుగా ఉండదు. అచ్చం ఇప్పుడు మహర్షి చేస్తున్న వసూళ్ల లెక్క ఎలా ఉంటుందో అలా దుమ్ముదులిపేస్తుంది.


వంశీ పైడిపల్లి డైరక్షన్ లో రిషి అలియాస్ మహర్షిగా మహేష్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో మరోసారి తన నటన గురించి అందరు మాట్లాడుకునేలా చేశాడు. ఇక ఈ సినిమా నైజాం లో 22.05 కోట్ల వసూళ్లను రాబట్టింది. 10 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్ట్ చేసింది అంటే ఫుల్ రన్ లో రాం చరణ్ రంగస్థలం రికార్డులను దాటేస్తుందని అంటున్నారు.


మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా నైజాం లో 27.76 కోట్లు కలెక్ట్ చేసింది. మహర్షి ఆ ఫిగర్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని పిస్తుంది. ఇప్పటికి నైజాం లో రోజుకి కోటి దాకా వసూళ్లు సాధిస్తుంది. సో నెక్స్ట్ వీక్ లోనే మహేష్ మహర్షి రంగస్థలం రికార్డులను క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. 


మహేష్ కెరియర్ లో 25వ సినిమాగా వచ్చిన మహర్షి రికార్డుల విషయంలో కూడా ల్యాండ్ మార్క్ మూవీగా నిలుస్తుంది. మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా మహర్షి సంచలనం సృష్టిస్తుంది. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి ముగ్గురు బడా నిర్మాతలు కలిసి నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్దె, అల్లరి నరేష్ కూడా నటించారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: