పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తమ్ముడు, బద్రి, జానీ వంటి మ్యూజికల్ సూపర్ హిట్స్ ఇచ్చిన సంగీత దర్శకుడు రమణ గోగుల. ఇతని మ్యూజిక్ లో వెస్ట్రన్ బీట్స్ ఎక్కువగా ఉన్నప్పటికి ఆడియో మాత్రం సూపర్ సక్సస్ అయ్యేది. విక్టరీ వెంకటేష్ కి ప్రేమంటే ఇదేరా, మహేష్ బాబుకు యువరాజు వంటి సినిమాలకు సంగీతమందించాడు. రమణ గోగుల మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే కాదు, లిరిసిస్ట్, సింగర్ కూడా. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో దాదాపు 25 సినిమాలకు సంగీతమందించిన రమణ దాదాపు అన్నీ సినిమాలకు మ్యూజిక్ పరంగా సూపర్ హిట్స్ ని ఇచ్చాడు. 


అంతేకాదు సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. అయితే గత కొన్నేళ్ళుగా సినిమాలకి, సంగీతానికి దూరంగా ఉంటున్నాడు. అందుకు కారణం కూడా లేకపోలేదు. సంగీత దర్శకుడిగా ఉన్న రమణ గోగుల నిర్మాతగా మారీ (2009)లో 'బోణీ' అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలి రమణను ఆర్ధికంగా బాగా దెబ్బ తీసింది. అప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇక తను చివరిగా సంగీతమందించిన సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది.


అంతేకాదు రమణ గోగుల నిర్మించిన 'బోణీ' సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయమైన కృతి కర్బందా అడపా దడపా సినిమాలు చేస్తూ హీరోయిన్ గా బానే పేరు సంపాదించుకుంది.  అయితే సినిమాలకు దూరంగా ఉన్న రమణ గోగుల తన సొంత వ్యాపారాలలో మాత్రం బిజీగా ఉన్నారు. వీసీ గా, సీ.ఈ.ఓ గా బాధ్యతలు నిర్వహిస్తూ స్టేట్స్ లో ఉన్నారు. ఎవరైనా అడిగితే సినిమాలు మానేశాను అంటున్న రమణ గోగుల మళ్ళీ తన అద్భుతమైన మ్యూజిక్ తో ఇండస్ట్రీకి ఎప్పుడొస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: