సినిమా... సినిమా... సినిమా... ఇదే ప్రపంచంగా బ్రతికే వాళ్ళు ఎందరో.  చిత్ర రంగంపై మక్కువతో ఆ రంగంలోకి అడుగుపెట్టి ఎలాగైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే కసితో పనిచేస్తుంటారు.  నిరూపించుకునే అవకాశం ఒక్కటైనా దొరకకపోతుందా అని ఎదురుచూస్తుంటారు.  ఆ ఎదురు చూపులు ఎప్పటికి ఫలిస్తాయో తెలియదుగాని, అప్పటి వరకు మాత్రం కృషి చేస్తూనే ఉంటారు.  


కృషి ఉంటె మనుషులు ఋషులౌతారు... ఇది నిజమే.  నిద్రను సైతం పక్కన పెట్టి... సినిమా కోసం కష్టపడి సెట్స్ నిర్మిస్తుంటారు.  ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకునే వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు.  వాళ్ళ శ్రమను గుర్తించి వాళ్ళ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది.  ఇంతలా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్లకు మనము అవకాశం ఇద్దామని చాలామంది అనుకుంటారు కదా.  


ఇలాంటి ఆలోచన కొద్దిమందికి వస్తుంది. ఆ కొద్దిమందిలో ఒకరు హరీష్ శంకర్.  గబ్బర్ సింగ్ సినిమాతో ఒక్కసారిగా దర్శకుడిగా పాపులరైన ఈ యువ దర్శకుడు... ప్రస్తుతం వరుణ్ తేజ్ తో వాల్మీకి చేస్తున్నాడు.  తమిళంలో సూపర్ హిట్టైన జిగర్తాండ సినిమాకు ఇది రీమేక్.  ఈ సినిమా కోసం ఆర్ట్ డిపార్ట్మెంట్ సెట్స్ ను నిర్మిస్తోంది.  


రాత్రి 2 గంటల సమయంలో కొంతంది సెట్ వర్కర్స్ అలసిపోకుండా... ఎనర్జీతో పనిచేయడం హరీష్ శంకర్ కంట పడింది.  వెంటనే వాళ్ళ చేస్తున్న వర్క్స్ తాలూకు ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.  నిర్విరామంగా పనిచేస్తున్న సిబ్బందికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పాడు.  సినిమాను మనం ప్రేమిస్తున్నాం... సినిమా మనల్ని ప్రేమిస్తుంది అని ఫోటో కింద టెక్స్ట్ మెసేజ్ చేశారు.  


ఈ ఫోటో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.  ఆలోచింపజేస్తోంది.  నిజమే కదా... మనం కూడా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది కదా... డబ్బు ఎలాగో ఇస్తారు... ఇలా వాళ్ళ శ్రమను గుర్తించి సోషల్ మీడియాలో వాళ్ళ గురించి రెండు మాటలు రాస్తే... అంతకంటే ఇంకేం కావాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: