ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు టెలివిజన్ రంగంలో దూసుకెళ్ళిపోతున్న శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలు అందరికీ డ్యాన్స్ కంపోజ్ చేయడం జరిగింది. శేఖర్ మాస్టర్ కి సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇంకా డాన్స్ రంగంలో మరియు టెలివిజన్ రంగంలో దూసుకెళ్ళిపోతున్న శేఖర్ మాస్టర్ తన ఆరాధ్య గురువు రాకేష్ మాస్టర్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఏమీ చెప్పలేకపోయాడు ఇద్దరి మధ్య జరిగిన గొడవ గురించి కూడా మాట్లాడలేకపోయారు. అయితే శేఖర్ తో తనకు విబేధాలు ఉన్న సంగతి నిజమేనని అంటున్నాడు రాకేశ్ మాస్టర్.

rakesh master comments on sekhar master

శేఖర్ తనకు తెలియకుండా ఏం చేసేవాడు కాదని.. కానీ పరిస్థితులు మారుతూ వచ్చాయని అన్నారు. ఎదిగే బిడ్డను(శేఖర్ మాస్టర్)నాశనం చేయొద్దని కొందరు తనకు కామెంట్స్ పెడుతున్నారని రాకేశ్ మాస్టర్ అన్నారు. అసలు శేఖర్ తో తనకు ఏ విషయంలో గొడవ వచ్చిందనే విషయాన్ని స్పష్టంగా చెప్పనప్పటికీ.. కొన్ని పరిస్థితుల్లో శేఖర్ తనను అవమానించిన విషయాలను చెప్పుకొచ్చాడు.

Related image

''శేఖర్ పెళ్లి విషయంలో నేనెంతో చేశాను. తన పెళ్లి సమయానికి నేను రాజమండ్రిలో షూటింగ్ లో బిజీగా ఉన్నాను. కానీ.. నా తమ్ముడు పెళ్లి అని చెప్పి షూటింగ్ నుండి కారు వేసుకొని నా అసిస్టెంట్స్ కొందరిని వెంటపెట్టుకొని పెళ్లికి వెళ్లాను. పెళ్లిలో ఏదో గొడవ అయిందని శేఖర్ మాస్టర్ ఏడ్చాడు.. అది చూసిన నేను తట్టుకోలేక తన దగ్గరకి వెళ్తే.. నన్ను పక్కకు నెట్టేశాడు.. ఆరోజు నేను చాలా బాధ పడ్డాను.. ప్రతీది షేర్ చేసుకునేవాడు.. కానీ ఏదీ చెప్పాలనుకోలేదు. ఇలాంటి కొన్ని సందర్భాలు ఎదురయ్యాయని ఆ కారణంగానే శేఖర్ తో మాట్లాడడం లేదని'' అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: