సినిమాటో గ్రాఫర్‌గా బాలీవుడ్ లో స్టార్స్ తో పనిచేసిన తేజ తన కష్టానికి వెరెవరికో క్రెడిట్ వస్తుందంటే భరించలేకపోయాడు. అందుకే డైరెక్టర్ అవ్వాలనుకున్నాడు. అంతే రామోజీ రావుకు 'చిత్రం' కథ చెప్పి ఉషా కిరణ్ మూవీస్ లో సినిమాని తెరకెక్కించాడు. దాంతో రాత్రికి రాత్రే తేజ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. అంతేకాదు ఎక్కువ శాతం కొత్త వాళ్ళతోనే సినిమాలు తీసీ ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చాడు. అంతేకాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్, నితిన్, నవదీప్, కాజల్ అగర్వాల్, అనిత, రీమాసేన్, సదా వంటి హీరో హీరోయిన్స్ ని  పరిచయం చేశారు.


అయితే ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. ముఖ్యంగా టైటిల్స్ విషయంలో అయితే రాం గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్, బోయపాటి శ్రీను..ఇలా ఒక్కొక్కరు స్క్రీన్ పైన తమ టైటిల్ వేసుకునే విషయం లో ఓ స్టైల్ ని సెంటిమెంట్‌గా పెట్టుకుంటారు. అలానే తేజ కి ఒక సెంటిమెంట్ ఉంది. టైటిల్స్ అన్నీ మొదట్లోనే వేసి తన టైటిల్ కార్డ్ మాత్రం ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు వేస్తాడు. అయితే ఇంటర్వెల్ కు ముందుగా ఎందుకు తన పేరు వేసుకుంటాడు.. అందులో ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. 


కానీ రీసెంట్‌గా తెలిసిన సీక్రెట్ ఏంటంటే ఈ సినిమాకు డైరెక్టర్ తేజ అనే ఉద్దేశంతో ఆడియన్స్ సినిమాను మొదలుపెట్టడం తేజకు ఇష్టం లేదట. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి సినిమాపై ఒక అవగాహన వస్తుందని.. ఒకవేళ సినిమా బాగుంటే ఇది తేజ సినిమా అనే ఉద్దేశంతో సెకండ్ హాఫ్ చూడవచ్చని.. అలా కాకుండా సినిమా చెత్త అయినా ఆ బాధ్యత తేజది అని ప్రేక్షకులకు చెప్పినట్టు ఉంటుందనే అలోచనతో ఇలా ఇంటర్వెల్ కు ముందు తన పేరు వేసుకుంటాడట. ఇక తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'సీత' 
మే 24 న రిలీజ్ కానుంది.  బెల్లంకొండ శ్రీనివాస్.. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: