తెలుగు ఇండస్ట్రీ సంచలన నటి గాయత్రీ గుప్త దేశంలో ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాల గురించి రేప్ వంటి విషయాల గురించి మరియు ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి చాటింగ్ కామెంట్ చేశారు. గాయత్రీ కొత్త ఫిదా ఐస్ క్రీమ్ మిఠాయి వంటి సినిమాల్లో నటించిన విషయం మనకందరికీ తెలుసు. గతంలో ఇండస్ట్రీ లో జరుగుతున్న క్యాస్టింగ్ కౌచ్ గురించి మరియు ఇంకా అనేక వాటి విషయాల గురించి గాయత్రీ గుప్త చేసిన బోల్డ్ కామెంట్స్ అప్పట్లో తెలుగు మీడియా చానల్స్ లో హీటెక్కించిన విషయం ఇప్పటికే అందరికీ గుర్తే.


ఇదిలా ఉండగా తాజాగా ఆడవాళ్ల వస్త్రధారణపై సంచలన కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. రేప్ లు ఎక్కువగా ఎందుకు జరుగుతాయంటే.. సెక్సువల్ ఫ్రస్ట్రేషన్ ఎక్కువ అవ్వడం వల్లే అని చెబుతోంది గాయత్రి. ఆకలిగా ఉన్నప్పుడు తిండి దొరకకపోతే మనిషి ఏం చేస్తాడో.. సెక్స్ కోరికలు కలిగినప్పుడు ఒత్తిడితో తప్పు అని తెలిసినా.. రేప్ చేస్తున్నారని.. అంతేతప్ప అమ్మాయి వేసుకున్న డ్రెస్ వలన కాదని చెప్పుకొచ్చింది.


అంతేకాకుండా ఇండస్ట్రీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు గురించి చాలామంది సినిమా ఇండస్ట్రీ లోకి రావాలంటే భయపడుతున్నారు అంటే..భయపడే మనిషి ఏది చేయాలన్నా భయపడుతూనే ఉంటాడు అని ...అసలు భయం లేకుండా ఇంటి నుంచి ధైర్యం చేసి బయటకు వచ్చాడు అంటే అది సినిమా కోసం అయినా కానీ ఉద్యోగం కోసం అయినా కానీ ఎక్కడైనా సమస్యలు సమస్యలే ఏదైనా ధైర్యం చేసి ఎదుర్కోవాలని తెలిపింది గాయ్.  



మరింత సమాచారం తెలుసుకోండి: