టాలీవుడ్ అంటే ఏ హీరోయిన్ కి అయినా ముద్దే. ఎందుకంటే గ్లామర్ హ్యాపీగా ఒలకబోయచ్చు. ఒక్క మూవీ హిట్ అయితే చాలు  ఆఫర్లు వెల్లువలా వస్తాయి. పారితోషికం కూడా టాప్ లో ఉంటుంది. సేఫ్ గా హ్యాపీగా సినిమాలు చేసుకోవచ్చు. అందుకే పరభాషా నటీమణుల కళ్ళన్నీ టాలీవుడ్ మీదనే


ఇక తమిళంలో వరుస చిత్రాలు చేస్తూ దూసుకుపోతున్న హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేశ్ ఒకరు. ఈమె త్వరలోనే తెలుగు వెండితెరపై కూడా కనిపించనుంది. యవ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఐశ్వర్యా రాజేశ్ నటించనుంది. ఈ సినిమా హిట్ మీద ఆమె ఆశలు పెట్టుకుంది. ఈ మూవీలో విజయ్ హీరో కావడం, క్రాంత్రి మాధవ్ డైరెక్టర్ కావడం పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి.
దాంతో సినిమా హిట్ అయితే ఇక టాలీవుడ్లో అడుగు పెట్టేయవచ్చు అనుకుంటోంది ఐశ్వర్య. సరే కానీ ఇపుడు ఓ గాసిప్ ని పట్టుకుని ఆడియన్స్ తోనే పజిల్ ఆడుతోంది ఈ అమ్మడు. 


విజయ్ దేవరకొండతో ఐశ్వర్యా రాజేశ్ ప్రేమలో పడినట్టు వార్తలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. వీటిపై ఈ హీరోయిన్ స్పందించింది. "నాకు ఒక ప్రేమకథ ఉందని, నేను ప్రేమలో ఉన్నాననే వార్తలను గత కొన్ని రోజులుగా వింటున్నాను. నేను ఎవరితో ప్రేమలో పడ్డాననే విషయం తెలుసుకోవాలని ఉందంటూ ట్వీట్ చేసింది.


నేను నిజంగానే ఎవరి నైనా ప్రేమిస్తే ముందుగా మీకే చెపుతానని, అనవసరంగా పుకార్లను చేయకండని" ఆమె కోరారు. ఈ పుకార్ల సంగతేమో కానీ ఈ బ్యూటి మరింతగా పాపులర్ అవడం ఖాయం. అందుకే తెలివిగా నో అనకుండా మీరే చెప్పండి అంటూ ఐశ్వర్య తెలివిగానే క్విజ్ టైప్ లో  ప్రశ్న సంధించిందంటున్నారు. ఇంతకీ ట్విస్ట్ ఏంటంటే తమిళంలో సెటిల్ అయిన తెలుగు అమ్మాయి ఈ ఐశ్వర్య. సో ఆమెకు టాలివుడ్లోకి రావడం అంటే రచ్చ గెలిచి ఇంటికి రావడమేగా.



మరింత సమాచారం తెలుసుకోండి: