ఏ ముహుర్తాన్న అర్జున్ రెడ్డి సినిమా కు సంతకం చేసాడో ఏమో కాని ఆహ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత విజయ్ రేంజ్ ఏ మారిపోయింది. సోషల్ మీడియా లో కూడా విజయ్ దేవరకొండ అని ఏ టైటిల్ లో పెట్టినా అది వైరల్ గా మారిపోతున్న పరిస్థితి. అంత క్రేజ్ సంపాదించాడు విజయ్ దేవరకొండ. తన ఇంటర్వ్యూ లతో , బోల్డ్ లూక్స్ తో రీసెంట్ గా తను ప్రమోట్ చేస్తున్న “రౌడీ” బ్రాండ్ తో కుర్రకారు లో మంచి యూత్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

 

అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ “గీత గోవిందం” కుడా అంత పెద్ద హిట్ ఏ అయ్యింది. మంచి కామెడీ టైమింగ్ యాక్టింగ్ స్కిల్ల్స్ తో విజయ్ ఓ మెట్టు పైకి ఏక్కాడనే చెప్పాలి. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. తరువాత వచ్చిన “టాక్సీవాల” హారర్, కామెడీ కధాంశంతో మంచి హిట్ అయ్యింది. అలా విజయ్ కి మంచి హ్యట్రిక్ అందినది అనే చెప్పుకోవచ్చు.

 

తాజా గా “డియర్ కామ్రేడ్” కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇదిలా ఉండగా లేటెస్ట్ గా “హీరో” టైటిల్ తో ఒక కొత్త కధ తో విజయ్ దేవరకొండ మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఆనంద్ అన్నామలై అనే డైరెక్టర్ తెరకేక్కిన్చబోతున్నారు.

 

ఈ సినిమా రీసెంట్ గా లాంచ్ చేసారు, లాంచ్ కి ప్రముఖ డైరెక్టర్ కోరతల్ శివ, ఏమేల్యే గొట్టిపాటి రవి కుమార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కొరటాల క్లాప్ కొట్టి సౌండ్ బోర్డు ఫస్ట్ సీన్ షాట్ తీశారు. రవి కుమార్ గారు కెమెరా స్విచ్ అన్ చేసారు. హీరో సినిమా ఒక మంచి మ్యుసికల్ థ్రిల్లర్ గా స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ తో చిత్రకరిస్తున్నారు. విజయ్ దేవేరకొండ మొదటిసారిగా ఒక సరికొత్త రోల్ లో కనిపించాబోతున్నాడట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: