టాలీవుడ్ అంటే హీరోల సంగతేమో కానీ హీరోయిన్లు మాత్రం పక్కాగా పరాయి భాషలకు చెందిన వారే. ఇక్కడ తెలుగు వారు ఎంతో మంది  ఉన్నా సరే మన హీరోలు, డైరెక్టర్లు మాత్రం పొరుగు ఇంటి పుల్ల కూరే రుచి అంటారు. ఇక టాలీవుడ్ మీద ఎక్కువ ప్రభావం చూపుతున్న వారిలో కన్నడ, మళయాళీ తారలు ముందు వరసలో ఉంటారు.


టాప్ రేంజిలో ఉన్న కన్నడ కస్తూరి అనుష్క శెట్టితో మొదలు పెడితే లేటేస్ట్ సెన్సేషన్ రష్మిక, . హరిప్రియ, మొన్నటి అందం రక్షిత, సంజన వీరిని మించి అచ్చమైన బాపూ బొమ్మ లాంటి ప్రణీత ఇలా వీరంతా కన్నడ సీమ నుంచి వచ్చి టాలీవుడ్లో సత్తా చాటారు. 


ఇపుడు కొత్త అందం హలో అంటూ టాలీవుడ్ ని  పలకరిస్తోంది. ఆమె ఎవరో కాదు కృతీ శెట్టి. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఉప్పెనలో హీరోయిన్ గా కృతీ శెట్టి పరిచయం అవుతోంది. ఈ ముద్దు గుమ్మ అందం చందం చూస్తే తెలుగులో బాగానే సెటిల్ అయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. మరి ఉప్పెన కనుక హిట్ అయితే కృతీ శెట్టి మరో అనుష్క శెట్టి రేంజిలోకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: