జమున అలనాటి నటి.  యాభై. అరవై, డెబ్బై దశకంలో వెండి తెరను ఏలిన అందాల రాణి. ఓ వైపు సావిత్రి, బీ సరోజాదేవి, అంజలిదేవిలతో పోటీ పడుతూనే తరువాత వచ్చిన వాణిశ్రీ తరంతోనూ గట్టి పోటీ ఇచ్చింది. మూడు దశాబ్దాల పాటు అలా నటిస్తూనే టాప్ హీరోయిన్ గా సత్తా చాటింది. ప్రజా నటి ఆమెకు ఉన్న అరుదైన బిరుదు.


ఇక జమున సినిమాలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చి 1989 పార్లమెంట్ ఎన్నికల్లో రాజమండ్రీ నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అయ్యారు. ఆ తరువాత ఆమె మళ్ళీ రాజకీయాల వైపు చూడలేదు. అయితే తాజాగా ఆమె ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.."ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లోకి సినిమా వాళ్లు రాకపోవడమే మంచిది" అన్నారు.


అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలనుకున్న "చిరంజీవిగారికి కూడా నేను ఇదేమాట చెప్పాను. మా అమ్మాయి పెళ్లికి శుభలేఖ ఇవ్వడానికి వెళ్లినప్పుడు, 'చిరంజీవిగారూ .. మీరు గొప్ప ఆర్టిస్ట్ .. మిమ్మల్ని ఎంతగానో అభిమానించేవాళ్లున్నారు. దయచేసి ఈ కుళ్లు రాజకీయాల్లోకి మాత్రం రావొద్దు' అని చెప్పాను. అప్పుడు అయన నవ్వేసి ఊరుకున్నారు.


కానీ వచ్చాక ఏం జరిగింది? మేమేదో వచ్చేస్తాం .. ఈ కుళ్లును కడిగేస్తాం అంటే ..  అది చాలా కష్టమైన విషయం .. జరిగేపని కూడా కాదు" అంటూ చెప్పుకొచ్చారు. తాజాగా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పోటీ చేశారు. ఐతే ఆయన‌కు కూడా సీట్లు పెద్దగా రావని ఎగ్టిట్ పోల్స్ చెబుతున్న టైంలో జమున కామెంట్స్ కి ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. పవన్ వరకూ సరే ఇక ఫ్యూచర్ లో ఎవరూ కూడా సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలైతే కనిపించడంలేదంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: