డైరెక్టర్ తేజ-కాజల్ అగర్వాల్ కి ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తనను చిత్ర సీమకు పరిచయం చేసిన డైరెక్టర్ గా కాజల్ కి తేజ అంటే ఎంతో గౌరవం. సాధారణంగా ఏ హీరోయిన్ కూడా ఇలా ఉండదు. కాస్త పాపులారిటీ వస్తే జీవితం ఇచ్చిన వాళ్ళనే మర్చిపోతారు. లేదా యాటిట్యూడ్ చూపిస్తారు. కానీ కాజల్ లో ఉన్న గొప్ప గుణం తనను ఇంతటి స్థాయికి రావడానికి బీజం వేసిన తేజ అంటే డేట్స్ ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించదు. ఇంతటి గొప్ప గుణమే కాజల్ ని స్టార్ హీరోయిన్ ని చేసింది. 


కాజల్ అగర్వాల్ - బెల్లంకొండ శ్రీను జంటగా తేజ దర్శకత్వం వహించిన సీత ఈనెల 24న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  కాజల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. స్వతహాగానే కాజల్‌కు పౌరాణికాలంటే చాలా ఇష్టమట. అయితే వాటితో ఏమాత్రం సంబంధం లేని పాత్ర 'సీత'. అందుకే సీత పాత్రలో నటించడం కోసం ఆ పాత్రను అర్థం చేసుకోడానికి చాలా పుస్తకాలను, మనుషులను చదివిందట.  


'సీత' సాఫ్ట్ కాదు .. సాహసాలు చేసే వీరవనిత. ఇందులో నేను చేసిన సాహసాలు థియోటర్లో అందరిని మెస్మరైజ్ చేస్తాయి. 200 కేజీల బరువున్న ఐస్ గడ్డల్ని నాపై వేసుకుని నటించాను. ఆ సన్నివేశంలో నటించేప్పుడు చాలా కష్టపడ్డాను. అంతేనా ఈ సినిమాలో కొన్ని రియల్ ఫైట్స్ చేశాను... అని చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: