మహేష్ బాబు పవన్ ఫ్యాన్స్ మధ్య గ్యాప్  ఉంది అని చాలామంది అంటూ ఉంటారు . అయితే  మహేష్ తనకు తానుగా పవన్ అభిమానులకు అనుకోకుండా  దొరికిన సందర్భాలు గతంలో చాలా తక్కువ. ఇలాంటి పరిస్థితులలో మహేష్ ను కొందరు ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేయడం వెనుక పవన్ అభిమానుల హస్తం ఉన్నదా? అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి .

మహర్షి సక్సెస్ మీట్ తర్వాత వరుసగా ట్వీట్స్ పెట్టాడు మహేష్. వంశీ పైడిపల్లిని పొగడ్డంతో పాటు సినిమా సూపర్  సక్సెస్ అంటూ వరుసగా ట్వీట్స్ పెట్టడం మహేష్ అభిమానులకు జోష్ ను కలిగిస్తే  కొందరి కి మాత్రం అసహనాన్ని కలిగించింది  "మహర్షి సినిమా సక్సెస్ అని ఒప్పుకుంటున్నాం ఇక వదిలేయ్  బాబూ" అంటూ రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేశారు నెటిజన్స్. వాస్తవానికి మహర్షి సినిమాకు మొదటి రోజునుండి మిక్స్ డ్ టాక్ వచ్చినా ఆ విషయాన్ని చాలా జాగ్రత్త గా  మెయిన్ టైన్ చేసారు అన్నది ఓపెన్ సీక్రెట్. 
 
వాస్తవానికి ఈ మూవీ కొందరికి  నచ్చితే  మరికొందరికి  నచ్చలేదు  దీనితో ఈ విషయాలు బయట పడకుండా రిలీజ్ రోజు నుంచినిన్న మొన్నటివరకు ప్రమోషన్ పేరిట మహేష్ హడావిడి చేస్తూనే ఉన్నాడు . ఈ ప్రయత్నం లో యూనిట్ కు సంబంధించి అందరిని విపరీతం గా మహేష్  పొగిడేస్తున్నాడు. 

ఈ అతిని కొంతమంది భరించలేక  కొందరు మహేష్ పై  రివర్స్ ట్వీట్స్ దాడి మొదలు  పెట్టారు. సినిమా హిట్టని ఒప్పుకుంటాం ఇక ఆపేయ్ అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు . అయితే ఈ సెటైర్ల వ్యవహారం నడుపుతున్నది మాత్రం పవన్ వీరాభిమానులు అనే అభిప్రాయం లో మహేష్ అభిమానులు ఉన్నారు .ఈ అపోయలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా మహేష్ అడ్డం గా దొరికి పోయింది మాత్రం పవన్ అభిమానులకే అంటూ ఒక కొత్త ప్రచారం మొదలు అయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: