ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో తమిళ, కన్నడ, మళియాల నటులు మంచి సక్సెస్ అందుకుంటున్నారు.  కన్నడ నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు తమ సత్తా చాటుకున్నారు. ఆ మద్య కేజీఎఫ్ చిత్రంతో యష్ కి ఇక్కడ ఎంతో మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు.  ఇక తమిళ నటులు సైతం తెలుగు లో తమకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు.
JAYAM RAVI PLAYING A PATIENT IN COMA
జయం రవి తమిళంలో నటించిన తనిఒరువన్ తెలుగు లో  ‘ధవ’గా రిమేక్ చేశారు.  ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా రాంచరణ్  హీరోగా నటించాడు.  ఇటీవల టిక్ టిక్ టిక్ అంతరిక్ష నేపథ్యంలో వచ్చిన చిత్రం కూడా మంచి సక్సెస్ అయ్యింది.  తాజాగా  జయం రవి, కాజల్ అగర్వాల్, సంయుక్త హెగ్డే మెయిన్ లీడ్స్‌గా కోలీవుడ్‌లో కోమలి అనే సినిమా రూపొందుతుంది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వంలో, వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై, ఇషారి కె.గణేష్ నిర్మిస్తున్నాడు. 

ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  చేతికి సెలైన్, పేషెంట్ గెట్ అప్ లో ఉన్న జయం రవి అయోమయంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు.  ఈ పోస్టర్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది.  పోస్టర్ బ్యాగ్రౌండ్ లో సోషల్ మీడియాకు సంబందించిన గుర్తులు ఉండటంతో ఇది సామజిక మాధ్యమాలపై వస్తున్న సెటైరికల్ మూవీ  అని అంతా భావిస్తున్నారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ లుక్ రిలీజ్ చేశారు.  దర్శకుడు కె.ఎస్.రవికుమార్, యోగిబాబు, కవితా రాధేశ్యామ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, హిప్ హాప్ తమిజా సంగీతమందిస్తున్నాడు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. కెమెరా : రిచర్డ్ ఎమ్.నాథన్, ఎడిటింగ్ : ప్రదీప్ ఈ.రాఘవ్. 


మరింత సమాచారం తెలుసుకోండి: