యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మార్కెట్ బాహుబలి సిరీస్ తరువాత బాగా పెరిగిపోయింది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భాస్ నెక్ట్స్ సినిమాలు అయిన సాహో, జాన్ సినిమాల‌కు హై బ‌డ్జెట్ పెట్టేస్తున్నారు. సాహో సినిమా ఏకంగా రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. సాహో త‌ర్వాత ప్ర‌భాస్ జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించే జాన్ సినిమాకు కూడా ఏకంగా రూ.150 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. సాహో బిజినెస్ రూ.300 కోట్లు దాకా చేసింది. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల‌తో పాటు ప‌లు భార‌తీయ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.


ప్ర‌భాస్ సాహో సినిమాకు జ‌రుగుతోన్న బిజినెస్‌తో టాలీవుడ్‌లోనే కాకుండా సౌత్‌లో నాన్ బాహుబ‌లి సినిమాల రికార్డుల‌ను బీట్ చేసేస్తోంది. సాహోకు విప‌రీత‌మైన క్రేజ్ ఉండ‌టంతో అందుకు త‌గ్గ‌ట్లే రిలీజ్ కూడా భారీగా ఉండేలా చూసుకుంటోంది యువీ క్రియేష‌న్స్ సంస్థ‌. ఇక సాహో ఏ భార‌తీయ సినిమా విడుద‌ల కానట్టుగా ఏకంగా 10 వేల స్క్రీన్ల‌లో రిలీజ్ అవుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ రికార్డు బాహుబ‌లి పేరిట ఉండ‌గా ఇప్పుడు సాహో దానిని బీట్ చేస్తోంది.


బాహుబ‌లిని ప్ర‌పంచ‌వ్యాప్తంగా 9 వేల థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే సాహో 10 వేల థియేట‌ర్లు అంటూ మామూలు విష‌యం కాదు. ఇక ఓవర్సీస్లోనూ ఈ సినిమా కోసం భారీ ఎత్తున స్క్రీన్లు బుక్ చేస్తున్నారు. ఏదేమైనా సాహో రిలీజ్‌కు ముందు బాహుబ‌లికే షాక్ ఇచ్చేలా క‌నిపిస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా... ఆగ‌స్టు 15న ఈ సినిమా రిలీజ్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: