అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల మూవీ సెకండ్ షెడ్యూల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈమూవీ సెకండ్ షెడ్యూల్ జూన్ మొదటి వారం నుండి సుమారు మూడు వారాలపాటు కొనసాగుతుందని సమాచారం. ఈమూవీలో కథ రీత్యా ప్రాముఖ్యత ఉన్న సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం ముందుగా ఒక తెలుగు హీరోయిన్ ను త్రివిక్రమ్ పరిగణలోకి తీసుకున్నా చివరి నిముషంలో ఆమెను తప్పించి బాలీవుడ్ హీరోయిన్ కెతిక శర్మను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

వాస్తవానికి ఈమధ్య కాలంలో హీరోయిన్ పాత్రలను చేస్తున్న ఒక తెలుగు యంగ్ హీరోయిన్ తో త్రివిక్రమ్ ఈమూవీలోని సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం చర్చలు జరపడం ఆమె కొన్ని హాట్ సీన్స్ లో నటించడానికి అంగీకరించింది అన్న వార్తలు ఉన్నాయి. అయితే అలాంటి హాట్ సీన్స్ లో తెలుగు అమ్మాయి కంటే ఒక యంగ్ బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుంది అనీ బన్నీ సూచించడంతో త్రివిక్రమ్ తన ఆలోచనలు మార్చుకుని పూరి కొడుకు ఆకాష్ తో నటించిన కెతిక శర్మను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఈమూవీలో అత్యంత కీలకమైన చెల్లెలి పాత్ర కోసం త్రివిక్రమ్ టాలెంటెడ్ హీరోయిన్ నివేద థామస్ కు ఆఫర్ ఇచ్చినా ఆమె ఆ పాత్రలో నటించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకసారి అలాంటి పాత్రలు స్వీకరిస్తే ఇక హీరోయిన్ పాత్రలు రావని హీరోయిన్స్ భయపడే పరిస్థుతులలో బన్నీకి సోదరి పాత్రలో నటించేందుకు నివేద ఒప్పుకోవడం ఒక సాహసం అని అంటున్నారు. 

ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘అలకనంద’ ‘నాన్న నేను’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్న త్రివిక్రమ్ ఈమూవీ టైటిల్ ను అధికారికంగా వచ్చేనెల ప్రకటించే ఆస్కారం ఉంది. ఈమూవీ షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఈమూవీని ఎట్టి పరిస్తుతులలోను ఈ సంవత్సరం విడుదల చేయాలి అన్న పట్టుదలతో బన్నీ త్రివిక్రమ్ ఉన్నట్లు సమాచారం..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: