వీవీ వినాయక్ దర్శకుడిగా సంచలన విజయాలు సాధించే సినిమాలు తీశారు. ఆయన పదహారు సినిమాలకు దైరెక్షన్ చేశారు. టాప్ హీరోలతో చేసిన సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి. ఒక్క నాగార్జున తో తప్ప సీనియర్లలో టాప్ ఫోర్ ని కవర్ చేశాడు. అలాగే యంగ్ జనరేషన్లోనూ దాదాపుగా అందరితో చేశాడు.


ఇపుడు వినాయక్ హీరో అవుతున్నాడు. 1980 నాటి కధాంశంతో తీస్తున్న ఈ మూవీలో వినాయకు తన ప్రెజెంట్ ఏజ్ కి తగ్గ రోల్ ప్లే చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో వినాయక్ పక్కన హీరోయిన్ ఎవరు అన్న ఆసక్తి ఉంది. దానికి జవాబుగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.


సీనియర్ నటి, ఇప్పటికీ తరగని బ్యూటీతో కుర్రాళ్ళను కిర్రాక్ చేస్తున్న శ్రియా వినాయక్ పెయిర్ గా ఈ మూవీలో ఆడి పాడబోతోందంట. శ్రియ ను హీరోయిన్ గా పెట్టి మెగాస్టార్ తో టాగూర్ ని వినాయక్ డైరెక్ట్ చేశాడు. అటువంటి శ్రియ తన పక్కన హీరోయిన్ అవుతుందని ఆయన వూహించి ఉండరు. ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు. తొందరలో సెట్స్ మీదకు వెళ్ళే ఈ మూవీ వినాయక్ కి కొత్త కెరీర్ ఇస్తుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: