సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా మహర్షి సెన్సేషనల్ హిట్ అయ్యింది. మహేష్ కెరియర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా వచ్చిన మహర్షి అంచనాలకు తగినట్టుగానే వసూళ్లను రాబడుతుంది. ఇదిలాఉంటే మహేష్ 25వ సినిమా హంగామా కొనసాగుతుంది.. అయితే ఇప్పుడు 26వ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. 


మహేష్ 26వ సినిమా అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తుందన్న విషయం తెలిసిందే. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. జూన్ సెకండ్ వీక్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాదు సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే సినిమా బిజినెస్ జరుగుతుంది.


అమేజాన్ ప్రైం వారు మహేష్ మహర్షిని 11 కోట్లకు కొన్నారట. ఇప్పుడు మహేష్ 26వ సినిమాకు ముందే బేరం మాట్లాడుతున్నారని తెలుస్తుంది. డైరటర్ అనీల్ రావిపుడి కూడా పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. ఎఫ్-2 తో డబుల్ హ్యాట్రిక్ లో మొదటి స్టెప్ వేసిన అనీల్ మహేష్ సినిమాతో దాన్ని ఫుల్ ఫిల్ చేస్తాడని అంచనా వేస్తున్నారు. 


ఇక సినిమా స్క్రిప్ట్ దశలోనే పక్కా హిట్ అంటున్నారు అంటే ఈ సినిమాతో మహేష్ కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే. భరత్ అనే నేను, మహర్షి రెండు సినిమాలతో హిట్ అందుకున్న మహేష్ అనీల్ రావిపుడి సినిమాతో కూడా విజయాన్ని సాధిస్తాడని అంటున్నారు. ఈ సినిమాకు రెడ్డి గారి అబ్బాయి అన్న టైటిల్ పరిశీలణలో ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: