ఏ హీరో అయినా స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత తను పోషించే పాత్రలు హై రేంజ్ లో ఉండాలనుకుంటారు. అంతే కాదు తన తోటి పాత్రలు తక్కువగా ఉండేలా రచయితలకు, దర్శకులకు సూచనలిస్తారు. ఏమాత్రం తన క్యారెక్టర్ ను ఇంకో క్యారెక్టర్ డామినేట్ చేయకూడని అనుకుంటారు. కానీ ఈ విషయంలో చిరంజీవి ఇలాంటి విషయాలను అసలు ఒప్పుకోరు. కథ డిమాండ్ మేరకు ఎలాంటి పాత్రతోనైనా వెండితెరమీద అలరిస్తారు. అందుకే 'స్వయంకృషి' సినిమాలో చెప్పులు కుట్టుకునే వాడి పాత్ర పోషించి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా కి ముందే చిరు కి భయంకరమైన స్టార్ ఇమేజ్ వచ్చేసింది. 


కాని డైరెక్టర్ కె.విశ్వనాథ్ గారు కథ చెప్పగానే తన పాత్రలో సహజత్వం ఉందని ఒక్క క్షణం ఆలోచించకుండా ఆ సినిమా చేయడానికి ఒప్పుకున్నారంటేనే చిరు ఎంటో అర్థమవుతుంది...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలున్నాయి. సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి తీసుకునే నిర్ణయం మీద ఇండస్ట్రీ వర్గాలకు చాలా నమ్మకం. ఆయన ఏదైనా బలంగా నమ్మి ఫలితాన్ని ఊహిస్తే అది ఖచ్చితంగా అలాగే జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. 'కత్తి' తెలుగు రీమేక్ ని తన కంబ్యాక్ కోసం ఎంచుకున్నప్పుడు అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళే ఎక్కువ. కాని చిరు దానికే కట్టుబడ్డారు. అద్భుతమైన ఫలితాన్ని అందుకున్నారు.  


మెగాస్టార్ జడ్జిమెంట్ కు ఉదాహరణగా 'సైరా' విషయంలో కూడా ఒక సంఘటన ఇటీవల జరిగింది.సైరాలో నరసింహరెడ్డి అనుచరుడిగా ఓబయ్య పాత్రలో నటిస్తున్న విజయ్ సేతుపతి క్యారెక్టర్ కాస్త లెంత్ ఎక్కువ వచ్చిందట. అంతే కాదు కొన్ని సీన్స్ లో చిరునే డామినేట్ చేసినట్టుగా కూడా అనిపించిందట. దీంతో రషెస్ చూసిన యూనిట్ ఆ సీన్స్ ని తగ్గించాలనే ఉద్దేశంతో చిరు ముందు ప్రతిపాదన పెడితే ఆయన నిర్మొహమాటంగా తిరస్కరించినట్టు తెలిసింది. ఇదే ప్లస్ అవుతుందని తెలుగుతో పాటు తమిళనాడులో దీనికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని చెప్పారట. ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు చిరుకి ఇగో ఏమాత్రం లేదని.


మరింత సమాచారం తెలుసుకోండి: