భారతదేశ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీస్టారర్ సినిమా ‘RRR’ తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా...అల్లూరి సీతారామరాజు పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు.


అంతేకాకుండా చెర్రీ హీరోయిన్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ నటిస్తుండగా..ఎన్టీఆర్ కు జోడీగా బ్రిటిష్ నటి డైసీ ఎడ్గార్ ను ఎంపిక చేశారు. కొన్ని కారణాల వలన ఆమె RRR మూవీ నుండి వైదొలగింది. ఎన్టీఆర్ జోడీ క్యారెక్టర్ కు సూటబుల్ ఆర్టిస్ట్ దొరకడం లేదు. స్క్రిప్ట్ ను మార్ఛి ఇండియన్ ఆర్టిస్ట్ ను ఆ క్యారెక్టర్ కు ఎంపిక చేయ వచ్చనే సలహాను రాజమౌళి తిరస్కరించారు.


స్క్రిప్ట్ లో ఏ ఒక్క మార్పు చేయడం కుదరదని, ఒకరి కోసం స్టోరీని మార్చే ప్రసక్తే లేదు..త్వరలోనే ఆ క్యారెక్టర్ కు తగ్గ ఆర్టిస్ట్ ను ఎంపిక చేస్తామని రాజమౌళి తెలిపారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న RRR మూవీ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. బాహుబలి విజయం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అనేక అంచనాలు నెలకొన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: