యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాగా ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఈరోజు ఓ స్పెష పోస్టర్ రిలీజైంది.


గాగుల్స్ పెట్టుకుని ప్రభాస్ లుక్ తో ఉన్న పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఆ పోస్టర్ ఏం చెబుతుంది అన్నది కొందరు ఆలోచిస్తుంటే కొందరు మాత్రం ఈ పోస్టర్ ఎక్కడ నుండి ఎత్తుకొచ్చారు అంటూ వెతకడం మొదలుపెట్టారు. ఖాళీగా ఉన్న కొంతమంది కొంచం అటు ఇటుగా సాహో స్టిల్ కు దగ్గరగా ఉన్న పోస్టర్ ఒకటి పట్టేశారు.


హ్యాంకాక్ అనే ఇంగ్లీష్ మూవీ పోస్టర్ తో సాహో మూవీ పోస్టర్ పోలిక ఉందని కనిపెట్టారు. కొందరి నెటిజెన్స్ కు ఇదొక్కటే పని అన్నట్టు ఉంది. ఇలా పోస్టర్ వచ్చిందో లేదో అది ఏ పోస్టర్ ని పోలింది.. ఏ సినిమా నుండి కాపీ చేసింది ఇట్టే చెప్పేస్తున్నారు. అయితే హ్యాంకాక్ సినిమా పోస్టర్ ను పోలినట్టే సాహో పోస్టర్ ఉండటం విశేషం.


అయితే పోస్టర్ తో కథ సేం టూ సేం అని చెప్పలేం. కాని తెలుగు ప్రేక్షకులకు సాహో ఓ క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ అనుభూతిని ఇస్తుందని మాత్రం అంటున్నారు. శంకర్ ఎహసన్ లాయ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. సినిమా రిలీజ్ పై ఉన్న అన్ని సందేహాలు ఒక్క పోస్టర్ తో పటాపంచలు చేశారు చిత్రయూనిట్. అయితే సాహో పోస్టర్ పై వస్తున్న కాపీ అలిగేషన్ పై ఇదంతా యాంటీ ఫ్యాన్స్ కావాలనే చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
 


మరింత సమాచారం తెలుసుకోండి: