‘మహర్షి’ మూవీతో తిరిగి ట్రాక్ లోకి వచ్చిన అల్లరి నరేశ్ ఈమూవీ తన కెరియర్ కు మంచి చేసిందో లేక చెడు చేసిందో తనకు అర్ధం కావడం లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేశ్ ఈ కామెంట్స్ చేసాడు. ‘మహర్షి’ సక్సస్ తరువాత తనకు ఫిలిం ఇండస్ట్రీ నుండి అవకాశాలు వస్తున్న విషయం పై స్పందిస్తూ అలాంటి అవకాశాలు తాను ఒప్పుకోవాలో లేక రిజక్ట్ చేయాలో తెలియని అయోమయ స్థితి తనకు ‘మహర్షి’ కలిగించింది అంటూ ఉద్వేగానికి లోనవుతున్నాడు. 

ఈమూవీ విడుదల తరువాత చాలామంది దర్శక నిర్మాతలు తనకు ఫోన్స్ చేసి తనను అభినందిస్తూ తాము తీయబోతున్న సినిమాలలో అతిథి పాత్రలు ఉన్నాయి ఆ పాత్రలలో నటిస్తారా అని అడుగుతున్న విషయాలను బయట పెట్టాడు. అయితే ఇలా తనకు వస్తున్న అతది పాత్రలు అన్నీ ఒప్పుకుని సినిమాలు చేయడం మొదలు పెడితే తాను స్పెషల్ రోల్స్ కు చిరునామాగా మారిపోయే అవకాసం ఉందని భయపడుతూ ‘మహర్షి’ కథలో తనకు లభించిన ప్రాధాన్యత స్థాయిలో తన పాత్ర ఉంటే నటిస్తాను అని సున్నితంగా సమాధానం ఇస్తున్న విషయాన్ని తెలియచేసాడు.

ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ తాను ‘మహర్షి’ మూవీ తరువాత తనకు హీరోగా అవకాశాలు వస్తాయి అనుకుంటే ఇలా తనను ప్రత్యేక పాత్రలకు పరిమితం చేయడం ఆశ్చర్యంగా ఉంది అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ‘కితకితలు’ హిట్ అయ్యాక అందరు దర్శక నిర్మాతలు అలాంటి కథలనే తన దగ్గరకు తీసుకు వచ్చి నటింప చేసిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఒకేరకం సినిమాలు చేయడం వల్ల తన కెరియర్ దెబ్బ తింది అన్న విషయం తనకు ఆలస్యంగా అర్ధం అయింది అని అంటున్నాడు.

దీనితో తన కెరియర్ కు సంబంధించి మరొక తప్పును ఖంగారు పడి చేయనని కేవలం ప్రత్యేక పాత్రలు చేసే స్టార్ గా తాను ముద్ర వేయించుకోవడం తనకు ఇష్టం లేదు అని అంటున్నాడు ఈ అల్లరోడు. ‘మహర్షి’ తో రికార్డులను క్రియేట్ చేయాలి అని ఆశ పడ్డ మహేష్ కు ఈమూవీ కలిసి రానట్లుగానే ‘మహర్షి’ లో ప్రత్యేక పాత్రలో నటించడం ద్వారా తనకు అవకాశాలు వస్తాయి అని కలలు కన్న నరేశ్ ఆశలు కూడ పగటి కలలు అయిపోయాయి అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: