సినిమా రంగంలో ఉన్న వాళ్లు ప్రేమించుకోవ‌డాలు... పెళ్లిళ్లు చేసుకోవ‌డాలు.. విడిపోవ‌డాలు కామ‌న్‌. చాలా జంట‌లు యేళ్ల‌కు ఏళ్లుగా ప్రేమించుకుని యేళ్లుగా కాపురాలు చేసి పిల్ల‌లు పెళ్లీడు కొచ్చాక కూడా విడిపోయారు. అమీర్‌ఖాన్‌, సైఫ్ ఆలీఖాన్‌... తాజాగా మ‌లైకా అరోరా - అర్బాజ్‌ఖాన్ ఇలా చెప్పుకుంటే పోతే బాలీవుడ్లో చాలా ఆశ్చ‌ర్య‌క‌రంగా కూడా విడిపోయిన జంట‌ల ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మ‌రో స్టార్ జంట చేరిపోయింది. హీరో ఇమ్రాన్‌ఖాన్ , ఆయ‌న భార్య అవంతిక విడిపోనున్నార‌ట‌. వీరి మ‌ధ్య తీవ్ర‌మైన విబేధాలు ఏర్ప‌డ్డాయ‌ని... చివ‌ర‌కు కుటుంబ స‌భ్యులు చెప్పినా వీరు వినే ప‌రిస్థితుల్లో లేర‌ని అంటున్నారు.


ఇంత‌కు ఇమ్రాన్‌ఖాన్ ఎవ‌రో కాదు బాలీవుడ్ మిస్ట‌ర్ ఫ‌ర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్‌కు స్వ‌యానా మేన‌ల్లుడు. ఇమ్రాన్‌ను వెండితెర మీద స్టార్ హీరో చేసేందుకు అమీర్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసినా ఇమ్రాన్ అంత‌గా స‌క్సెస్ కాలేదు. ఇప్పుడు మేనల్లుడి కాపురాన్ని చక్కదిద్దేందుకు అమీర్ స్వ‌యంగా రంగంలోకి దిగినా ఉప‌యోగం లేద‌ని తెలుస్తోంది. రీసెంట్ గా కుటుంబ సభ్యులందరితో కలిసి అమీర్ దిగిన ఫ్యామిలీ ఫొటోలో కూడా అవంతిక కనిపించలేదు.


ఇక అవంతిక కుటుంబ పెద్ద‌లు ఎంత‌సర్దిచెప్పినా త‌న బిడ్డ‌ను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింద‌ట‌. ఈ జంట‌కు ఐదేళ్ల పాప కూడా ఉంది. వీరిద్ద‌రు విడిపోవ‌డానికి ఇమ్రాన్ ప్రొఫెష‌న‌ల్ లైఫ్ కార‌ణ‌మ‌న్న గుస‌గుస‌లు బీ టౌన్‌లో వినిపిస్తున్నాయి. ఇమ్రాన్ హీరో వేషాల సంగ‌తి బీ టౌన్ జ‌నాలు ఎప్పుడో మ‌ర్చిపోయారు. ఇప్పుడు క్యారెక్ట‌ర్ రోల్స్ కూడా రాని ప‌రిస్థితి. ఈ కోపాన్ని ఆయ‌న భార్య అవంతిక‌పై చూపించ‌డంతో వీరి మ‌ధ్య గొడ‌వ‌లు స్టార్ట్ అయ్యాయ‌ట‌. ఏదేమైనా ఎనిమిదేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు ఐదేళ్ల పాప ఉండ‌గా దూర‌కావ‌డం బాధాక‌ర‌మే.


మరింత సమాచారం తెలుసుకోండి: