మల్లికా శెరావత్ బాలీవుడ్ లో సినిమాలు తగ్గించేసిన కేన్స్ లో అందాలను ఆరబోయటంలో మాత్రం తగ్గలేదు. క్వీన్ కంగన.. ఐశ్వర్యారాయ్.. ప్రియాంక చోప్రా.. హీనా ఖాన్.. దీపిక పదుకొనే .. సోనమ్ కపూర్.. వీళ్లంతా అదిరిపోయే షోస్ తో యువతరం గుండెల్లోకి దూసుకెళ్లారు. మెజారిటీ పార్ట్ మ్యారీడ్ బ్యూటీస్ ఈసారి కేన్స్ రెడ్ కార్పెట్ ని షేక్ చేయడంలో పోటీపడ్డారు. అదే బాటలో తాజాగా `మర్డర్` బ్యూటీ మల్లికా శెరావత్ రంగ ప్రవేశం చేయడం హాట్ టాపిక్ గా మారింది.


మల్లిక నటించిన `హిస్ స్ స్ స్..` చిత్రాన్ని వరల్డ్ వైడ్ అభిమానలు అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఆ చిత్రంలో బుసలు కొట్టే సర్పకన్యగా అప్పటికప్పుడే మనిషిగా మారిపోతూ మల్లిక నటించిన తీరు ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంది. అయితే ఇటీవల మల్లిక ఓ విదేశీ బిజినెస్ మేన్ ని పెళ్లాడి బాలీవుడ్ కి పూర్తిగా దూరమైపోయింది. ఆ క్రమంలోనే అమ్మడిని అంతా మర్చిపోయారు.ఇలా మరిచారు అనగానే అలా కేన్స్ 2019 ఉత్సవాల్లో తళుక్కున మెరిసి మరోసారి సర్ ప్రైజ్ చేసింది మల్లిక.


ఒకప్పుడు కేన్స్ అంటే మల్లికనే అన్నట్టు ఉండేది. ఐశ్వర్యారాయ్ తో పోటీపడుతూ వయ్యారాల వడ్డనలు చేసిన మల్లిక కాలక్రమంలో ఆ ఇమేజ్ ని కోల్పోయింది. తాజాగా కేన్స్ రెడ్ కార్పెట్ పై అదిరిపోయే డ్రెస్ లో తళుక్కుమంది. హిస్.... అంటూ నల్ల త్రాచులా నడిచొచ్చింది. మార్కో టస్సనీ అనే ఓ స్పెషల్ డిజైనర్ డ్రెస్ లో మల్లిక తళుక్కుమంది. టోనీవార్డ్ కోచుర్ అంటూ ఈ స్టైలిష్ డిజైనర్ డ్రెస్ ని పిలుస్తున్నారు. మొత్తానికి మల్లిక మరోసారి తుఫాన్ లా కేన్స్ పై విరుచుకుపడిందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: