ముని సిరీస్ ని కంటిన్యూ చేస్తూ ప్రముఖ కొరియో గ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ కాంచన, గంగ, శివలింగ, అంటూ సీక్వెల్స్ ని తీసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు కమర్షియల్ గా మంచి సక్సస్ ని సొంతం చేసుకుంటున్నాడు. తమిళం తో పాటు తెలుగులో నూ డబ్ చేస్తున్న ఈ సినిమాలు ఇక్కడ కూడా మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకుంటున్నాయి. దీంతో లారెన్స్ కి డైరెక్టర్ గా మంచి పేరు వచ్చేసింది. 


ఇక కాంచన సినిమాని బాలీవుడ్ కి తీసుకెళ్ళడానికి రంగం సిద్దం చేసుకున్నాడు రాఘవ లారెన్స్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా తెరకెక్కించడానికి అంతా సిద్దమైంది. అయితే ఇంతలో ఈ సినిమా నుండి రాఘవ లారెన్స్ బయటకు వచ్చేసి సంచలనమైన నిర్ణయం తీసుకోవడమే కాకుండా బాలీవుడ్ లో నిర్మిస్తున్న ఈ సినిమా నిర్మాతల పైన సంచనలనమైన కామెంట్స్ ని చేశాడు. 


అయితే లారెన్స్ అలా కామెంట్స్ చేయడానికి బలమైన కారణం ఉంది. అదేంటంటే ఈ సినిమా నుంచి ఇటీవలే అక్షయ్ కుమార్ గెటప్ కి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు నిర్మాతలు తుషార్ కపూర్ .. షాబినా ఖాన్. ఈ విషయం రాఘవ లారెన్స్ కి తెలియకుండా జరిగింది. దాంతో ఒక దర్శకుడిగా నా అనుమతి లేకుండా నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను ఎలా రిలీజ్ చేస్తారు. ఇది నన్ను అవమానించినట్టు అని హర్ట్ అయిన లారెన్స్ వెంటనే ఈ సినిమా నుండి తప్పుకున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: