పీక్ సమ్మర్ లో థమ్స్ అప్ తన కూల్ డ్రింక్స్ సేల్స్ మరింత పెంచుకోవడానికి తమ బ్రాండ్ అంబాసిడర్ మహేష్ తో ఒక సరికొత్త యాడ్ ను తయారుచేసి విడుదల చేసింది. ఈ యాడ్ లో మహేష్ చాల రఫ్ లుక్ లో కనిపిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నాడు. 

ఈ యాడ్ లో మహేష్ పక్కన నటించిన అమ్మాయి ఇప్పుడు మీడియాకు మాత్రమే కాకుండా మహేష్ అభిమానులకు కూడ హాట్ టాపిక్ గా మారడంతో ఈమె ఎవరు అన్న అన్వేషణ ప్రారంభం అయింది. ఈమె పేరు దివా ధావన్ ఈమె పుట్టింది పెరిగింది అంతా అమెరికాలో అయినప్పటికీ ఆమె తల్లితండ్రులకు ఉన్న భారతీయ మూలాల రీత్యా ఆమె ముంబాయిలో ఉంటోంది.

కింగ్ ఫిషర్ 2019 క్యాలెండర్ షూటింగ్ కోసం ఇండియాకు వచ్చిన ఈమె ఫిగర్ ను చూసి ధమ్స్ అప్ యాడ్ కు ఈమెను ఎంపిక చేసారు. మోడలింగ్ అంటే విపరీతమైన మోజు ఉన్న ఈ బ్యూటీ అనేక ఫ్యాషన్ షోలలో పాల్గొనడమే కాకుండా ఫాక్స్ లైఫ్ ఛానల్ లో ఒక షోను ఈమె నిర్వహిస్తోంది. 

అయితే షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే ఈమెకు బాలీవుడ్ లో అదేవిధంగా మన టాలీవుడ్ నుండి కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థల నుండి సినిమా ఆఫర్లు వస్తున్నా ఆమె తిరస్కరిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు సినిమాలలో నటించడం అంటే తనకు చాల బోర్ అనీ ఆఖరుకు మహేష్ పక్కన నటించే అవకాసం వచ్చినా తాను వదులుకుంటాను అని చెప్పి ప్రస్తుతం ఈమె మహేష్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది..  


మరింత సమాచారం తెలుసుకోండి: