హీరోగా అనేక విజయవంతమైన సినిమాలలో నటించిన సుమన్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి విభిన్న పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థుతులలో తనను ఒక దర్శకుడు అనుష్క పేరు చెప్పి మోసం చేశాడు అంటూ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రమదేవి’ మూవీలో సుమన్ విలన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఆసినిమాలో విలన్ పాత్రలో నటించడానికి అనుష్క కారణం అని అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు సుమన్. తనకు అనుష్కతో ఒక భారీ ఫైట్ సీన్ ఉంటుంది అని చెప్పి దర్శకుడు గుణశేఖర్ తనను ఆ విలన్ పాత్రకు ఒప్పించిన విషయాన్ని తెలియచేసాడు. 

అయితే గుణశేఖర్ ‘రుద్రమదేవి’ మూవీలో తన పాత్రను తగ్గించడమే కాకుండా అనుష్కతో ఎలాంటి భారీ ఫైట్ సీన్ షూట్ చేయలేదని చెపుతూ ఒక విధంగా గుణశేఖర్ తనను తప్పుదోవ పట్టించాడు అని కామెంట్స్ చేసాడు సుమన్. అనుష్కతో ఫైటింగ్ అనగానే తాను ఫైట్ మాష్టర్ ను పెట్టుకుని ఫైట్స్ గురించి చాల ప్రిపేర్ అయిన సందర్భాన్ని వివరిస్తూ తాను పారితోషికం గురించి కూడ పట్టించుకోకుండా ‘రుద్రమదేవి’ లో నటిస్తే తాను పారితోషికం విషయంలో కూడ గుణశేఖర్ చేతిలో మోసపోయాను అంటూ సుమన్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

అయితే గుణశేఖర్ మొదట్లో తనకు చెప్పిన విధంగా తన విలన్ పాత్రను అనుష్కతో సమానంగా తీర్చిదిద్ది ఉంటే తనకు గుణశేఖర్ పారితోషికం ఇవ్వకపోయినా పట్టించుకునే ఉండేవాడిని కాననీ అయితే తనను అన్ని విధాలుగా దర్శకుడు గుణశేఖర్ తప్పుదోవ పట్టించాడు అని సుమన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే ‘రుద్రమదేవి’ మూవీకి విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చినా కలక్షన్స్ విషయంలో అనుకున్న స్థాయిలో విజవంతం కాకపోవడంతో గుణశేఖర్ సుమన్ కు పారితోషిక విషయంలో ఇచ్చిన మాట తప్పి ఉంటాడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: