ఒకవైపు ఎన్నికల కౌంటింగ్ హడావిడి కొనసాగుతున్న పరిస్థితులలో కాజల్ నటించిన ‘సీత’ సినిమా విడుదల అడ్డుకోవాలని కొన్ని హిందూమత సంస్థలు చేస్తున్న ప్రయత్నాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.  పురాణ పాత్ర‌లను పేర్ల‌ను పెట్టుకునేడప్పుడు చాలా జాగ్ర‌త్త‌గా ఉండవలిసిన పరిస్థితులలో ఈ విషయంలో ఏమాత్రం తేడా జరిగినా హిందూ మ‌త సంఘాల నుంచి విమ‌ర్శ‌ల్ని ఎదుర్కోవాలసి వ‌స్తుంది. 

ప్ర‌స్తుతం ‘సీత‌’ కూడా అలాంటి స‌మ‌స్య‌నే ఎదుర్కొంటోంది. తేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాలో కాజల్ ‘సీత’ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. రేపు విడుదల కాబోతున్న ఈ మూవీలోని   కొన్ని డైలాగులు స‌న్నివేశాలు పురాణాల్ని హిందూ మ‌తాన్ని కించ‌ప‌రిచేలా ఉంద‌ని బీజేవైఎమ్ సంస్థ ఆరోపిస్తోంది. 

హిందూమ‌తాన్ని సాంప్ర‌దాయాల్ని ప్ర‌చారం చేసే బీజేవైఎమ్‌ ‘సీత‌’ మూవీ పై విమర్శలు చేస్తోంది. అంతేకాదు ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగా ఈ సంస్థ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యింఛి ఈ సినిమా విడుదల అడ్డుకోవాలని చివరి నిమిషంలో ప్రయత్నాలు చేస్తోంది.  అయితే ఈ సినిమాకు  సెన్సార్ బోర్డు అనుమ‌తివచ్చిన నేపధ్యంలో  ఈ సినిమాను అడ్డుకోవడం కష్టం అని అంటున్నారు.   

మరి ఊహించని విధంగా ఈ సినిమాకు న్యాయపరమైన సమస్యలు ఏర్పడితే దర్శకుడు తేజ ఎలా  స్పందిస్తాడో చూడాలి. ఇది చాలదు అన్నట్లుగా ఈసినిమా విడుదల సందర్భంలో కాజల్ చాల సెక్సీగా కనపడుతూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఫోటో షూట్ పై మరింత వివాదాలు రాజుకుంటూ ఒక పవిత్రమైన పేరుతో ఉన్న పాత్రను పోషిస్తున్న కాజల్ ఇలాంటి పనులు ఎందుకు చేస్తోంది అంటూ హిందూ మత సంస్థలు ఆమె పై మండిపడిపోతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: