ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు కొత్తచరిత్ర సృష్టించే దిశగా దూసుకు వెళుతున్న నేపధ్యంలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ఫన్నీ ట్విట్ కలకలం రేపుతోంది. తెలుగుదేశం ఘోర పరాజయం చూసి   వైసిపి శ్రేణుల్లో ఆనందం తాండవిస్తున్న నేపధ్యంలో వారికన్నా రామ్ గోపాల్ వర్మ మరింత ఆనందాన్ని పొందుతున్నాడు. 

ఇప్పటికే పంచరైన సైకిల్ ముందు బాబు బేలగా కూర్చుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వర్మ కలకలం సృష్టించాడు. ఇలాంటి వ్యంగ్యాస్త్రాలు వర్మ వైపు నుండి ఇలా రెండు మూడు రోజులు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల విషయంలో వర్మ ఎదుర్కున్న ఇబ్బందులతో తీవ్ర అసహనానికి లోనైనా వర్మ ఇప్పడు తన భాదను అంతా మరిచిపోతున్నాడు. 

చంద్రబాబు వెన్నుపోటు గురించి బాబు రెండు ముఖాల పోకడ గురించి అనేక సార్లు పదేపదే చెపుతూ వచ్చిన వర్మ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి  కలిగిన పరాభావం పండుగగా మారింది.  ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలయ్య ఎంతో కష్టపడినా ఫలితం దక్కలేదు. అయితే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీని వర్మ ఎలా తీసినా జనం చూడటమే కాకుండా జనం మరిచిపోయిన ఆ సంఘటనను తిరిగి గుర్తుకు చేసుకున్నాడు.

తెలుగుదేశం పరాజయానికి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వర్మ సహకరించాడు అన్నది వాస్తవం. లక్ష్మీ పార్వతికి జరిగిన అన్యాయాన్ని హైలెట్ చేస్తూ వర్మ తీసిన ఈమూవీ వల్ల తిరిగి జనం మధ్య లక్ష్మీపార్వతి పేరు మారుమ్రోగేలా పరిస్థుతులు ఏర్పడ్డాయి. అయితే రానున్నరోజులలో వర్మ ఇక్కడితో సరిపెడతాడా లేకుంటే అతడి టార్గెట్ ఇలాగే కొనసాగుతుందా అన్న విషయం ప్రస్తుతానికి సస్పెన్స్..   


మరింత సమాచారం తెలుసుకోండి: