ఎన్నికల ఫలితాలు ఏమాత్రం ‘జనసేన’ కు ఆశాజనకంగా లేని పరిస్థితులలో పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరం పాటు పడ్డ కష్టానికి ఫలితం ఏమిటి అంటూ జనసైనికులు కూడ అంతర్మధనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఊహించని ఈ నెగిటివ్ ఫలితాలకు షాక్ అయిన పవన్ కళ్యాణ్ కొద్ది సేపటి క్రితం తన ఇంటిలో ‘జనసేన’ కు సంబంధించిన ముఖ్య నేతలతో సమావేశమై ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనికితోడు పవన్ పోటీ చేసిన భీమవరం గాజువాక స్థానాలలో కూడ కొద్ది సేపు ఎదురీత మరికొంత సేపు ఆశ దోబూచులాడుతూ ఉండటంతో బయటకు చెప్పుకోలేని టెన్షన్ లో పవన్ వీరాభిమానులు ఉన్నారు. ఇలాంటి పరిస్థుతులలో నిన్న కోన వెంకట్ పవన్ ‘జనసేన’ భవిష్యత్ పై చెప్పిన అంచనాలు నిజంగానే నిజం అయ్యాయా అన్న అభిప్రాయం పవన్ వీరాభినులలో ఉంది.   

ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ‘జనసేన’ గురించి కోన వెంకట్ కామెంట్ చేస్తూ రాజకీయాలలో కొన్ని వ్యూహాత్మక తప్పులు పవన్ చేసాడు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు రాజకీయాలలో ఒక శక్తిగా ఎదగాలని ప్రయత్నించిన పవన్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ పోటీ చేయకుండా ఏమాత్రం రాజకీయంగా బలం లేని కమ్యూనిష్టు పార్టీలతో బహుజన్ సమాజ్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకుని పవన్ తనకు రాజకీయంగా బలం లేదు అని తనకు తానుగా చెప్పుకున్నట్లు అయిందని కోన వెంకట్ ఎన్నికల ఫలితాలు రాకుండానే తన విశ్లేషణ ఇచ్చాడు. 

ఇది ఇలా ఉంటే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలు ఉత్తరాంద్ర జిల్లాలలో కూడ జనసేన కు ఆశించిన స్థాయిలో ఓట్లు పడకపోవడంతో కొణిదల కుటుంబం రెండవ సారి కూడా రాజకీయాలలో రాణించ లేక పోయిందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో కనీసం ఎదో ఒక స్థానంలో కూడ పవన్ గెలవకపోతే ‘జనసేన’ ను బతికించు కోవడం పవర్ స్టార్ కు కూడ శక్తికి మించిన పనిగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: