భారతీయ సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రకాశ్ రాజ్.  బుల్లితెరపై తన ప్రస్థానం మొదలు పెట్టిన ప్రకాశ్ రాజ్ వెండి తెరపై ఎన్నో రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.  ఒకప్పుడు గుమ్మడిలా యంగ్ ఏజ్ నుంచే ముదుసలి పాత్రల్లో నటించడం మొదలు పెట్టారు.  తండ్రిగా, మామగా, తాతగా అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.  ఆ మద్య ప్రకాశ్ రాజ్ లేని సినిమాలు లేవు.


టాలీవుడ్ లో టాప్ హీరోలందరికీ విలన్ గా నటించారు.  ఈ మద్య రాజకీయాల్లోకి వచ్చిన ప్రకాశ్ రాజ్ బిజేపిపై ఎన్నో విమర్శలు చేశారు. ముఖ్యంగా నరేంద్ర మోదీపై ఎన్నో విమర్శలు చేశారు.   ప్రకాష్ రాజ్ పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. కాగా బెంగుళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుండి ఇండిపెండెంట్ అభ్యర్థి గా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ చిత్తు చిత్తుగా ఓడిపోయాడు. బెంగుళూరు సెంట్రల్ నుండి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న అంటూ ఆరు నెలల ముందే ప్రకటించిన విషయం తెలిసిందే.


నేడు వెలువడిన ఫలితాల్లో ప్రకాశ్ రాజ్ కి దారుణంగా 30 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. దాంతో ప్రకాష్ రాజ్ కు డిపాజిట్ కూడా దక్కలేదు. కాగా,  నరేంద్ర మోడీ ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన ప్రకాష్ రాజ్ తన స్నేహితురాలు గౌరీ లంకేశ్ హత్యకు నిరసనగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ.. ఒడిపోయినప్పటికి పోరాట పంథా వీడేది లేదని స్పష్టం చేశాడు. తప్పకుండా గెలుస్తానని ఆశపడిన ప్రకాష్ రాజ్ ఓటమితో కుంగిపోయాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: