ప్రస్తుతం సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు తాము కూడా లైంగిక వేధింపులకు గురి అయినవారేమే అంటూ సోషల్ మీడియా వేధికగా తమ ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.  మీటూ, కాస్టింగ్ కౌచ్ లాంటి ఉద్యమాలు వస్తున్నా..కొంత మంది కామంధుల్లో ఎలాంటి మార్పులు రావడం లేదని బాధపడుతున్నారు సెలబ్రెటీలు.  సినిమా ఛాన్సు కావాలంటే తమకు పడక సుఖం ఇవ్వాల్సిందే అన్న కండీషన్లు పెడుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నటీమణులు. 


తాజాగా కార్తీ ‘చెలియా’, సుధీర్ తో ‘సమ్మోహనం’లాంటి సినిమాల్లో నటించిన  అదితీరావు హైద్రీ ఆ మద్య వరుణ్ తేజ్ నటించిన ‘అంతరిక్షం’సినిమాలో కనిపించింది.  ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోను ఆమె వరుస అవకాశాలను అందుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చిత్రపరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి ప్రస్తావించింది.


కెరీర్ బిగినింగ్ లో తాను ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురి అయ్యానని.. ఒక సినిమా విషయంలో రాత్రికి తనకు పడక సుఖం అందిస్తే..ఆ ఛాన్సు దక్కుతుందని..లేదా వేరే హీరోయిన్ కి వెళ్లిపోతుందని ముఖం ముందే చెప్పాడు.  దాంతో నాకు ఏడుపొచ్చింది..ఛీ ఇలాంటి పాడు పని చేసి సంపాదించే ఛాన్సు నాకు అవసరం లేదని చెప్పుతో కొట్టినట్లు మాట్లాడి వచ్చానని అన్నారు.

అందుకే నో చెప్పేసి ఆ ప్రాజెక్టును వదిలేశాను. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ధైర్యంగా మాట్లాడాలి. మౌనంగా వుంటే ఆ మౌనాన్ని మరో రకంగా అర్థం చేసుకునే అవకాశం వుంది   అని చెప్పుకొచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: