తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే కామెడీ షోలో ఒకటి జబర్థస్త్.   ఈ కార్యక్రమం మొదలై ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవుతున్నా ఎప్పుడూ కొత్తదనంతో టివి ముందు కూర్చున్న ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తుంది.  జబర్ధస్త్ లొ పాల్గొని మంచి క్రేజ్ సంపాదించిన ఎంతో మంది నటులు ఇప్పుడు వెండి తెరపై తమ సత్తా చాటుకుంటున్నారు. 

గత ఆరు సంవత్సరాలుగా జబర్ధస్త్ కి జడ్జీలుగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు, ఎమ్మెల్యే,నటి రోజా లు తమదైన మార్క్ చాటుకుంటూ వస్తున్నారు.  గత మూడు నెలల నుంచి ఈ జబర్ధస్త్ లో నాగబాబు, రోజాలు కనిపించకుండా పోవడం..ఎన్నికల సందర్భంగా ప్రచారాల్లో పాల్గొనడంతో ఈ గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి.  వారి స్థానంలో నటి మీనా, కొరియోగ్రాఫర్ జాని మాస్టార్లు వచ్చారు. 

ఈ మద్య మళ్లీ రోజా రీ ఎంట్రీ ఇచ్చింది..ప్రస్తుతం నటి సంఘవి జబర్ధస్త్ కనిపిస్తుంది.  ఇదిలా ఉంటే తాజాగా రోజా నగరి నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవడంతో..ఆమె శాశ్వతంగా జబర్ధస్త్ తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోజాకు మంత్రి పదవి దక్కితే తప్పనిసరిగా జబర్దస్త్ ని వదిలేయాల్సి ఉంటుంది. 

మహిళా ఎమ్మెల్యేలలో కీలకంగా ఉన్నది రోజానే కాబట్టి ఆమెకు మంత్రి పదవి లాంఛనమే అని అంటున్నారు. దీనితో రోజా జబర్దస్త్ ని వదిలేయక తప్పదని వార్తలు వస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అంటే జబర్దస్త్  కంటిన్యూ చేసింది..ఇప్పుడు మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి ప్రోగ్రామ్ లు చేస్తే ఆమె స్టేటస్ తగ్గిపోతుందని పలువురు భావిస్తున్నారు.  మరి ఇంది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: