పవన్ పోటీ చేసిన రెండు స్థానాలలోనూ ఓడిపోయినా పవన్ ‘జనసేన’ కు సుమారు 20 లక్షల ఓట్లు రావడం రాజకీయ వర్గాలలో మాత్రమే కాకుండా ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో కూడ ఒక ఆసక్తికర విషయంగా మారింది. కనీసం ఒక ఎమ్.ఎల్.ఎ గా కూడ ఎన్నిక అవ్వలేని పరిస్థితిలో ఉన్న ఒక నాయకుడు లీడ్ చేసిన పార్టీకి 20 లక్షల ఓట్లు రావడం చిన్న విషయం కాదు. 

దీనితో పవన్ ‘జనసేన’ కు సంబంధించి అనుసరించిన వ్యూహాలలో క్లారిటీ లేకపోవడం వల్లనే ఇలాంటి ఘోర పరాజయం వచ్చిందనీ లేకుంటే పవన్ లాంటి ఇమేజ్ ఉన్న ఒక టాప్ హీరో ఎమ్.ఎల్.ఎ గా ఎన్నకోబడటం అతి సాధారణమైన విషయం అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో పవన్ పరాజయం పై సెటైర్ల కన్నా మీడియా వర్గాలలో సానుభూతి ఎక్కువగా కనిపిస్తోంది. 

దీనికితోడు పవన్ జనసేనకు సపోర్ట్ గా ఫిలిం ఇండస్ట్రీ నుండి ఎవరు ప్రత్యక్షంగా పవన్ కు సహాయంగా రాకపోయినా పవన్ వ్యక్తిత్వం మంచితనం తెలిసిన చాలామంది ఇండస్ట్రీ ప్రముఖులు పవన్ ఓటమి పై తమ బాధను తమ సన్నిహితులతో వ్యక్తం చేస్తున్నట్లు టాక్. పవన్ పోటీ చేసే స్థానాల పై చివరి వరకు పవన్ తన మనసులోని మాటను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచడంతో పవన్ క్యాడర్ కూడ పవన్ పోటీ చేసే స్థానాలలో సరైన ప్రచారం చేయలేకపోయింది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. 

దీనికితోడు పవన్ తన ‘జనసేన’ అభ్యర్ధుల ప్రచారం కోసం ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో తిరుగుతూ పూర్తిగా తాను పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల ప్రచార విషయంలో అశ్రద్ధ చేయడం కూడ పవన్ ఓటమికి కారణం అన్న కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జగన్ హవా కొనసాగుతున్న నేపధ్యంలో మరో రెండు సంవత్సరాల వరకు ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అంశాలు కూడ ఉండవనీ ఇలాంటి పరిస్థుతులలో పవన్ ఇలా ‘జనసేన’ పార్టీని నమ్ముకుని కాలంగడిపేకన్నా ప్రస్తుతం అతడికి వస్తున్న ఆఫర్లలో ఎదో ఒకటి ఎంచుకుని రాబోతున్న రెండు సంవత్సరాలలో కనీసం రెండు సినిమాలు చేస్తే కానీ పవన్ ఇమేజ్ కి ఏర్పడ్డ డ్యామేజ్ అంత సులువుగా ప్రజలు మరిచిపోరు అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: