కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్నైట్ స్టార్ అయిన రష్మిక మందన్న తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హిట్టు కొట్టడం ఆ వెంటనే వచ్చిన గీతా గోవిందం సినిమా సూపర్ హిట్ అవడంతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది. దేవదాస్ సినిమా పెద్దగా ఆడకపోయినా రష్మికకు తెలుగులో మాత్రం అవకాశాలు అదరగొడుతున్నాయి.


తొలి సినిమాకు 20 లక్షల పారితోషికం అందుకున్న రష్మిక గీతా గోవిందం తర్వాత 50 లక్షల దాకా రెమ్యునరేషన్ పెంచేసిందట. ఇక ఇప్పుడు తన క్రేజ్ ను బట్టి స్టార్ సినిమాకు 80 లక్షలు.. కుర్ర హీరో సినిమాకు కోటి దాకా డిమాండ్ చేస్తుందట రష్మిక. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది.


హీరోయిన్ గా క్రేజ్ రావడమే ఆలస్యం రెమ్యునరేషన్ పెంచేస్తుంటారు. వారి దారిలోనే రష్మిక కూడా టాలీవుడ్, కోలీవుడ్ లో తనకు వచ్చిన ఈ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్యాష్ చేసుకుంటుంది. తెలుగులో అమ్మడి లక్ మాములుగా లేదు.. రెండు హిట్లకే అదరగొడుతుంది రష్మిక. ఇక తెలుగులో క్రేజీ ఫ్యాన్స్ ను ఏర్పరచుకుంది అమ్మడు.


ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న రష్మిక ఆ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ సినిమా ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది. అదే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ పట్టేసిందని టాక్. చూస్తుంటే తెలుగు, తమిళ భాషల్లో రష్మిక హవా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు కోటి మాత్రమే డిమాండ్ చేస్తున్న అమ్మడు ఇదే ఫాం కొనసాగితే కోటిన్నర రెండు కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందని చెప్పొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: