సౌత్ - నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న హాట్ హీరోయిన్ రాధిక ఆప్టే. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించిన ఈ రాధిక - తెలుగులో బాలకృష్ణ తో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే ఈ హాట్ బ్యూటి నార్త్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుందన్న వాస్తవం అందరికి తెలుస్తూనే ఉంది. అంతేకాదు బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్ లో కూడా గ్లామరస్ రోల్స్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ - హాలీవుడ్ సినిమాలతో పాటు అంతర్జాతీయ స్థాయి వెబ్ సిరీస్ లలో కూడా రాధిక నటిస్తూ బాగా ఫేమస్ అయింది.


రాధిక నటించిన వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు రావడంతో లేటెస్ట్‌గా మరోసారి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. హాలీవుడ్ లో నటించేందుకు సిద్దం అవుతున్న ఈ రాధిక ఈ సారీ ఎలాంటి క్యారెక్టర్ తో అలరించబోతుందోనని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఛాలెంజింగ్‌గా అనిపించిందంటే ఎలాంటి బోల్డ్ క్యారెక్టర్‌లోనైనా నటించేందుకు రెడీ అవుతుంది.


ఇక అందరిలానే రాధిక కూడా హీరోయిన్ అవకపోయి ఉంటే టీచర్ వృత్తిని ఎంచుకునేదట.. రాధికకు  చిన్నప్పటి నుండి మ్యాథ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను మ్యాథ్స్ లో ఉన్నత చదువులు చదివి మ్యాథ్స్ టీచర్ గా సెటిల్ అయ్యేదాన్ని అంటూ రీసెంట్‌గా ఒక సందర్భంలో చెప్పింది. అయితే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా ప్రస్తుతం తన కెరీర్ బావుందని రాధిక చెప్పడంతో పాటు ఇప్పుడు ఎంచుకున్న వృత్తి ఎంతో సంతృప్తికరంగా ఉందని కూడా చెప్పడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: